Site icon Desha Disha

ఋణ వసూళ్ల కు ప్రైవేట్ ఏజెన్సీ లను ప్రభుత్వం రద్దు చేయాలి

ఋణ వసూళ్ల కు ప్రైవేట్ ఏజెన్సీ లను ప్రభుత్వం రద్దు చేయాలి

బ్యాంక్ లు సైతం ప్రైవేట్ కిరాయి ఏజెన్సీ లను నియమించుకోవటం సిగ్గుచేటు .

ఏ ఋణన్ని అయినా కోర్టు ద్వారానే వసూలు చేసుకునే విధంగా ప్రభుత్వ చర్యలు అమలు చేయాలి .

వడ్డీ వ్యాపారస్తుల వేధింపుల నుండి ఋణ గ్రస్తులకు రక్షణ కల్పించాలి ..

మేడా శ్రీనివాస్, డిమాండ్ ,
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : ఋణ లావాదేవీలకు సంబందించి న్యాయవాది ధ్రువీకరణ తప్పనిసరి చేసే విధంగా ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ..ఋణాలు వసూలుకు కిరాయి మూకలతో దాడులు దౌర్జన్యాలు జరిపిస్తున్నారు . ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ వ్యక్తులను ఋణాలు వసూలుకు ఉపాధి ముసుగులో దాదా గిరికి కిరాయి సైన్యాన్ని ప్రోత్సహస్తున్నట్టుగా వుంది . తద్వారా వడ్డీ వ్యాపారస్తులు ఘోరమైన దౌర్జన్యాలతో ఋణ గ్రస్తులను వేదిస్తున్నారు . హింసిస్తున్నారు . కొన్ని పరిస్థితుల్లో దాడులు చేస్తు కుటుంబంలో పిల్లలను , వృద్ధులను భయబ్రాంతులకు గురించేస్తున్నారు . వడ్డీ వ్యాపారస్తులు దౌర్జన్యాలపై పోలీస్ లకు ఫిర్యాదులు చేస్తున్నా బాధితులకు ఏ విధమైన రక్షణ లేకపోతుంది . న్యాయం జరగకుంటుంది . ప్రతి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ల్లోను , వడ్డీ వ్యాపార కర్యాలయాల్లోను ఋణ గ్రస్తులను బెదిరించటానికి ఒక రకమైన కిరాయి మూకలను బాహటంగానే పెంచి పోషిస్తున్నారు . వారి వేధింపులు , చేష్టలు చాలా వికృతంగా ఉంటుంటాయి . బాధితుల ఘోషకు ఎవ్వరు అండగా నిలవక పోగా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కూడా దాడులు చేస్తున్నారు . ప్రజల జీవన అవసరాలు పైన పరిస్థితుల పైన ప్రభుత్వం ఒక ప్రత్యేక పర్యవేక్షణ జరిపించి ఋణ వసూళ్లకు ప్రైవేట్ ఏజెన్సీ లను ప్రభుత్వం ప్రోత్సహించ కుండా తక్షణమే ఆ తరహా ప్రైవేట్ ఏజెన్సీ లను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు .ఋణ వసూళ్లకు ప్రభుత్వ రంగ సంస్థ లైన బ్యాంకులు కూడా లోను రికవరీలకు ప్రైవేట్ ఏజెన్సీ లను నియమించుకోవటం సిగ్గు మాలిన చర్యగా బావించాలి . చట్ట నిబంధనలకూడా వ్యతిరేకంగా ప్రైవేట్ గుండాలను ఉపాధి ముసుగులో ప్రభుత్వం ప్రోత్సహించటం బాదాకరం . బ్యాంకులు అధికారికంగా గురించిన ఋణ వసూళ్ల ప్రభుత్వ ఏజెన్సీల మంటు ఋణగ్రస్తులను తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు . వీరి వీధిపులలో పసి పిల్లలు, మహిళలు, వృద్ధులు సైతం కొన్ని సందర్బాలలో తీవ్రంగా నష్ట పోతున్నారు . గాయ పడుతున్నారు . చట్ట బద్ధమైన హక్కులు కానరాని విధంగా ఋణ వసూళ్లకు ప్రైవేట్ ఏజెన్సీలు తెగబడుతున్నాయి . రికవరీ మూకల దాడుల్లో గాయపడిన బాధితులకు పోలీస్ లు సైతం రక్షణ కల్పించలేని విధంగా ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతున్నారు . న్యాయం అందక, రక్షణ దొరకక ప్రైవేట్ ఏజెన్సీ దాడులకు బాధితులు తలాగ్గాల్సి వస్తుంది . కొన్ని ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తుల వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . ఈ మధ్య వడ్డీ వ్యారస్తులు, కార్పొరేట్, ప్రైవేట్ , ప్రభుత్వం నియమించుకుంటున్న ప్రైవేట్ ఏజెన్సీలు సాంకేతిక పరిజ్ఞానంతో ఋణ గ్రస్తుడు పరిచయస్తులకు , బందువులకు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తు అసభ్య కరంగా మాట్లాడుతున్నారు . కొన్ని ప్రైవేట్ ఏజెన్సీల దౌర్జన్య మూకలు ఫోన్లు చేసి మీ అమ్మాయి ఫోటోలను నగ్నంగా చిత్రికరించి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తాం అని బెదిరిస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు .కాలయాపనకు , వివాదాలకు తావు లేకుండా ఏ ఋణాన్నైనా చట్ట బద్దంగా వసూలు కాబడే విధంగా ఒక బలమైన ప్రభుత్వ వ్యవస్థను అమలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలి . ఋణ గ్రస్తులు , ఋణ దారుల మధ్య ఏర్పడే వివాదాలు 6 నెలలు దాటకుండా తీర్పులు వెలువడే విధంగా చట్ట సవరణలు జరిపి శాంతి భద్రతలకు ప్రభుత్వం ఆదర్శంగా నిలవాలి . ఏ విధమైన ఋణ లావాదేవీలు కైనా ప్రాదిమిక రోజు నుండి 10 ఏళ్లు అనుభవం గల న్యాయవాది ధ్రువీకరణను తప్పనిసరి చేస్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను అమల్లోకి తేవాలి . తద్వారా ఋణ బాధితులు , ఋణ దారులు మధ్య సమస్యలు సర్దుమణుగుతాయి . ప్రస్తుత వడ్డీ వ్యాపారస్తుల దాడులు, దౌర్జ్యలకు ప్రభుత్వాల అసమర్థతే ప్రధాన కారణంగా బావించాలి . ప్రస్తుతం ప్రచారంలో ఉన్నటువంటి కాల్ మణి కేసులు బాధితులను కాపాడలేక పొగా వడ్డీ వ్యాపారస్తులకు అండగా నిలుస్తు బాధితులను వెక్కిరిస్తున్నట్టుగా వుంది . వేధింపులు ఆగవు , చట్టాలు రక్షించవు , పాలకుల అసమర్ధత బాదితులను నిత్యం వేదిస్తూనే వుంటున్నాయి . మెరుగైన సంస్కరణలతో చట్ట పరమైన హక్కులు ప్రజలకు అందే విధంగా ప్రభుత్వ చర్యలు కాబడే విధంగా పాలనా విధానాలు అమలు కాబడాలని , వడ్డీ వ్యాపారస్తులు , ప్రైవేట్, కార్పొరేట్ ఋణ వేధింపుల నుండి మానసిక ఒత్తిడిలకు గురవుతున్న బాధితులకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అండగా నిలుస్తుందని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ బాధితులకు భరోసా ఇచ్చారు. సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు ..ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , సిమ్మా దుర్గారావు , దుడ్డే త్రినాధ్, దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్, కారుమూరి యుగంధర్, మాసా అప్పాయమ్మ , నాగూరు అన్నపూర్ణ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, వాడపల్లి జ్యోతిష్ , డి వి వి ఎస్ ఎన్ మూర్తి యాదవ్, వల్లి శ్రీనివాసరావు , బత్తెన శివన్నారాయణ , జవ్వాది మోహన్ , కాకర ప్రసాద్, మాసా కమల, చల్లా సాంబశివరావు , చల్లా అఖిల్ , గెద్దాడ సుందరి,తదితరులు పాల్గొనియున్నారు

Exit mobile version