Site icon Desha Disha

ఆ అమ్మాయితో.. ఆ రెస్టారెంట్లో.. హీరో నాని సీక్రెట్

ఆ అమ్మాయితో.. ఆ రెస్టారెంట్లో.. హీరో నాని సీక్రెట్

Hero Nani’s Secret: ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న స్టార్ హీరోలందరు ప్రస్తుతం సినిమాలతో పాటుగా కొన్ని షోలకు హోస్టులుగా కూడా వ్యవహరిస్తున్నారు…ఇక ఇప్పటికే బాలయ్య బాబు ఆన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక అతనితోపాటుగా నాగార్జున సైతం బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేస్తున్నాడు. ఇక ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకొని, ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ ను అందుకుంటున్న నటుడు జగపతిబాబు…ఈయన ప్రస్తుతం జీ వాళ్ళు నిర్వహిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటికే రెండు ఎపిసోడ్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఆయన ఇప్పుడు మూడో ఎపిసోడ్ కోసం నాచురల్ స్టార్ నాని ని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది…ఇక నాని తో చాలా డీప్ గా డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ షో లో జగపతిబాబు నాని ని ఇరికిస్తూ ఆరోజు బంజారాహిల్స్ నుంచి వెళ్తుంటే మోకా రెస్టారెంట్లో ఆ అమ్మాయి అంటూ నానిని బుక్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక దానికి నాని క్లారిటీ ఇస్తూ ఆమె స్క్రిప్ట్ డిస్కషన్ కోసం మాత్రమే వచ్చింది అని చెప్పాడు…

స్క్రిప్ట్ డిస్కషన్ కోసం వచ్చిందా? అంటూ జగపతిబాబు నవ్వుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా నాని తన సీక్రెట్స్ ను మాత్రం ఎక్కడా బయటపెట్టనట్టుగా తెలుస్తోంది. మరి ఈ షో నుంచి వచ్చిన ప్రోమో అద్భుతంగా ఉందని, పలువురు నెటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాని ఈ మధ్యకాలంలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

కాబట్టి ఆయన ఈ సమయంలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడానికి ఈ షో కి రావడం అనేది నిజంగా చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఇక జయమ్మూ నిశ్చయమురా షో లో హోస్ట్ గా చేస్తున్న జగపతిబాబు ఈ షో ను ఇప్పటికే టాప్ లెవల్ కి తీసుకెళ్లాడు. కాబట్టి నాని ఎపిసోడ్ తో ఈ షో ను మరింత టాప్ లోకి తీసుకొచ్చి పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆదివారం 9 గంటలకు జీ సినిమాల్లో ఈ షో టెలికాస్ట్ అవుతోంది.

ఈ షో చూస్తే నానికి సంబంధించిన పూర్తి విషయాలను మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఇక నాని తన చిన్నతనంలో ఎలాంటి కష్టాలను పడ్డాడు. సినిమా ఇండస్ట్రీలో తను ఎదగడానికి ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నాడు అనే విషయాల మీద కూడా సరైన క్లారిటీ అయితే వస్తోంది…

Exit mobile version