BiggBoss9 Telugu Dammu Srija: కేవలం కవర్ పేజీని చూసి బుక్ ఎలాంటిదో నిర్ణయించకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు. వాటికి ఈమధ్య కాలం లో ఎన్నో ఉదాహరణలు మనం చూశాము. ప్రస్తుతం దమ్ము శ్రీజ(Dammu Srija) ని చూస్తే ఈ పదాలు సరిగ్గా సరిపోతుంది అనుకోవచ్చు. ఈమె ఆడిషన్స్ కి వచ్చిన సమయం లో ఈమె గొంతు,ఆమె వాలకం చూసి ఏమి అమ్మాయి రా బాబు, ఇలా ఉందేంటి అని ప్రతీ ఒక్కరు అనుకున్నారు. ముఖ్యంగా జడ్జీలు అయితే భయపడిపోయారు. అభిజిత్(Abhijeet), బిందు మాధవి(Bindu Madhavi) అత్యంత వేగంగా ఆమెకు రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చారు. కానీ నవదీప్(Navdeep) మాత్రం ఈమె ఎవరో మన లాంటి క్యారక్టర్ ఉన్న అమ్మాయి లాగా ఉంది, అవకాశం ఇచ్చి చూద్దాం అని ఒక్క గ్రీన్ ఇచ్చి అగ్నిపరీక్ష తదుపరి రౌండ్స్ ఆడేందుకు పంపాడు. అబ్బా అవసరమా అసలు ఆమెకు అని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆమె టాస్కులన్నీ దుమ్ము లేపేస్తుంది.
Also Read: ‘అగ్నిపరీక్ష’ ప్రేక్షకుల ఓటింగ్ లో దూసుకుపోతున్న టాప్ 2 కంటెస్టెంట్స్ వీళ్ళే!
ఉన్న 15 మందిలో నిన్న ఈమె ఆడిన తీరుకి జడ్జీలు ఎంతో మెచ్చుకొని ‘బెస్ట్ కంటెస్టెంట్’ ట్యాగ్ ఇచ్చి ఆడియన్స్ ని ఓటు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఆమెకి కల్పించారు. అంతే కాదు ఈమెని చూసి అభిజిత్ ఆడిషన్స్ లో ఎంత చిరాకు పడ్డాడో మనమంతా చూసాము. ఆయన ముఖం లో వంద బూతులు వెతుక్కోవచ్చు, ఆ రేంజ్ లో చిరాకు పడ్డాడు. అలాంటి వ్యక్తి నిన్న మాట్లాడుతూ ‘నీ మీద నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను.. నువ్వు ఇలాగే అద్భుతంగా ఆడుతూ ముందుకు దూసుకుపోవాలి’ అని చెప్పుకొచ్చాడు. బిందు మాధవి కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఇది కదా అసలు సిసలు విజయం అంటే. అంతే కాదు దమ్ము శ్రీజా లో ఎలాంటి మాస్క్ లేదు. ఏదైనా ముఖం మీదనే మాట్లాడేస్తుంది. తన తోటి కంటెస్టెంట్ కి అన్యాయం జరిగితే మొట్టమొదట రెస్పాన్స్ ఇచ్చింది ఆమెనే.
Also Read: ఓజీ నుండి ‘సువ్వి సువ్వి’ సాంగ్ వచ్చేసింది..పవన్ కళ్యాణ్ లో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ ఉందా!
అంత మంది రెస్పాన్స్ ఇవ్వడానికి భయపడ్డారు కానీ దమ్ము శ్రీజా మాత్రం ధైర్యం గా చెయ్యి పైకి లేపింది. ఇక్కడి నుండే ఆమె ఆడియన్స్ మనసుల్ని దోచుకోవడం మొదలు పెట్టింది. అంతే కాదు బిగ్ బాస్ కోసం ఏమి చెయ్యడానికి అయినా రెడీ అని టాటూ టాస్క్ అప్పుడు అందరికీ అర్థం అయ్యింది. ఇక చివరి టాస్క్ లో ఆమె మగవాళ్ళతో పోటీ పడి చివరి వరకు ఆడపులి లాగా పోరాడింది. ఇది నిజంగా అందరినీ షాక్ కి గురి చేసింది, దమ్ము శ్రీజా లో ఇంత దమ్ము ఉందా అంటూ ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. పిట్ట కొంచెం కూత ఘనం అని నవదీప్ సైతం ఈమెని మెచ్చుకున్నారు. బిగ్ బాస్ షో కి వెళ్ళడానికి అన్ని విధాలుగా అర్హత ఉన్న దమ్ము శ్రీజాకి, బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం వస్తుందో లేదో చూడాలి.