Site icon Desha Disha

YCP MLCs rebellion: వైసీపీ ఎమ్మెల్సీల తిరుగుబాటు.. ఏకంగా కోర్టుకు!

YCP MLCs rebellion: వైసీపీ ఎమ్మెల్సీల తిరుగుబాటు.. ఏకంగా కోర్టుకు!

YCP MLCs rebellion: ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చాలామంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. తమ ఎమ్మెల్సీ పదవులకు సైతం రాజీనామాలు ప్రకటించారు. మండలి చైర్మన్ ఫార్మేట్లో రాజీనామా లేఖలను పంపించారు. అయితే ఏడాది అవుతున్న ఆ రాజీనామాలను ఆమోదానికి నోచుకోలేదు. దీంతో వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే తాజాగా జనసేనలో చేరిన ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ.. హైకోర్టును ఆశ్రయించారు. తన రాజీనామాను ఆమోదించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన రాజీనామాను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో అదే బాటలో మిగతా ఎమ్మెల్సీలు సైతం కోర్టుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీలు కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకీయాఖానం రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలను మండలి చైర్మన్ మోసేన్ రాజు ఆమోదించడం లేదు.

కూటమి ప్లాన్ కు చెక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో బలం ఉంది. ఏవైనా బిల్లులు వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) భావించారు. అక్కడే కూటమి కొత్త ఎత్తుగడ వేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలకు రాజీనామా చేయించి.. వారి స్థానంలో కూటమి నేతలతో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని చూసింది. తద్వారా శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెక్ చెప్పాలని భావించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మండలి చైర్మన్ మోసేన్ రాజు దీనికి అడ్డుపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం పొందితే.. మండలి మొత్తం కూటమి చేతుల్లోకి వెళ్లిపోతుందని భావించి.. ఆ రాజీనామాలను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారు. ఏడాదికాలంగా తొక్కి పెట్టారు.

మండలిలో వైసీపీకి బలం..
శాసనమండలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత 38 మంది వరకు ఎమ్మెల్సీల మద్దతు ఉండేది. తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఎమ్మెల్సీలు వైసిపికి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనకు దగ్గరయ్యారు. అటువంటివారు రాజీనామా చేసినా ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. కూటమితో ఒప్పందం చేసుకున్న చాలామంది ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామా ఆమోదానికి నోచుకుని ఉంటే టిడిపి తో పాటు జనసేనలో చేరేవారు. కానీ వైసీపీకి చెందిన మండలి చైర్మన్ అడ్డుపడుతున్నారు. దీంతో పోతుల సునీత, కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి పొలిటికల్ డిఫెన్స్ లో ఉన్నారు. అటు మర్రి రాజశేఖర్ పరిస్థితి అలానే ఉంది. జయ మంగళం వెంకటరమణ మాత్రం జనసేనలో చేరారు. ఆయన టిడిపి నుంచి వైసీపీలో ఎన్నికలకు ముందు చేరారు. వైసిపి ఓడిపోవడంతో జనసేనలో చేరారు. తన రాజీనామాను ఆమోదించాలని తాజాగా ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం.. మిగతావారు సైతం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. చూడాలి మరి ఎలాంటి తీర్పు వస్తుందో?

Exit mobile version