Shrasti Verma in Bigg Boss 9 Telugu: గత ఏడాది ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) పై లైంగిక వేధింపుల కేసు వేసి సంచలనం సృష్టించిన శ్రేష్టి వర్మ(Shrasti Verma) పేరు ని అంత తేలికగా మన ఆడియన్స్ మర్చిపోలేరు. ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి ఆగింది?, వాళ్ళిద్దరితో తప్పు ఎవరిదీ అనేది పక్కన పెడితే, ప్రస్తుతం వీళ్లిద్దరు ఎవరి కెరీర్ ని వాళ్ళు చూసుకుంటున్నారు. జానీ మాస్టర్ బెయిల్ మీద విడుదలై మళ్ళీ ఆయన సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. రీసెంట్ గానే రవితేజ మాస్ జాతర చిత్రానికి పని చేసాడు. అదే విధంగా రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ కి మెజారిటీ పాటలకు ఈయనే కొరియోగ్రఫీ చేస్తున్నాడు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా, కన్నడ సినిమాలు కూడా సమాంతరంగా చేస్తున్నాడు. ఇలా జానీ మాస్టర్ కెరీర్ ఒకప్పటి లాగానే ఫుల్ బిజీ గా ఉంది.
ఇక శ్రేష్టి వర్మ విషయానికి వస్తే ఈమె కూడా తన కెరీర్ లో ఫుల్ బిజీ గానే గడుపుతుంది. చేతికి వచ్చిన సినిమాలు చేస్తుంది కానీ, ఇంకా బిజీ కొరియోగ్రాఫర్ గా మాత్రం మారలేదు. అయితే ఈమెకు ఇప్పుడు బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చిందట. రీసెంట్ గానే ఈమెని బిగ్ బాస్ టీం సంప్రదించి ఇంటర్వ్యూ చేశారు. వారానికి రెండున్నర లక్షల రూపాయిలు ప్యాకేజ్ కుదిరిందని టాక్. ఈమె సెలబ్రిటీ హోదాకు ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే జనాలకు బాగా పరిచయం ఉన్నటువంటి టీవీ యాంకర్స్, టీవీ సీరియల్ హీరోయిన్స్ కి కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ గతం లో ఇవ్వలేదు. రెండు లక్షల రూపాయిలు గరిష్టంగా ఇచ్చేవారు. కానీ ఈమెకు మాత్రం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కారణం, ప్రస్తుతం ఆమె సెన్సేషన్ క్రియేట్ చేసిన సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ కాబట్టి.
మరి బిగ్ బాస్ షో ద్వారా ఈమె జనాలకు ఎంత దగ్గర అవ్వబోతుందో చూడాలి. బిగ్ బాస్ టీం గతం లో కూడా ఇలా పబ్లిక్ లో హాట్ టాపిక్ గా మారిన వాళ్లనే ఎంచుకున్నారు. వారిలో శేఖర్ బాషా ఒకరు. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం లో శేఖర్ బాషా బాగా హైలైట్ అవ్వడం, ఆ తర్వాత ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం గత సీజన్ లో అందరికీ పెద్ద సర్ప్రైజ్. ఇప్పుడు ఈ సీజన్ లో కూడా అలాంటి ట్రేండింగ్ సెలబ్రిటీ నే ఎంచుకున్నారు. ఈమెతో పాటు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. ఈమె కూడా ఎంత పాపులారిటీ ని సంపాదించిందో ఈమధ్య కాలంలో మనమంతా చూశాము.