Site icon Desha Disha

Pawan Kalyan Senatho Senani Meeting: టీడీపీకి ప్రత్యామ్మాయంగా జనసేనను పవన్ నిలబెడుతారా?

Pawan Kalyan Senatho Senani Meeting: టీడీపీకి ప్రత్యామ్మాయంగా జనసేనను పవన్ నిలబెడుతారా?

Pawan Kalyan Senatho Senani Meeting: టీడీపీకి ప్రత్యామ్మాయంగా జనసేనను పవన్ నిలబెడుతారా?

Pawan Kalyan Senatho Senani Meeting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ నుంచి.. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పార్టీ కార్యక్రమాలు ఏవి జరగలేదు. 2024 ఎన్నికల్లో పొత్తు ద్వారా మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి.. శత శాతం గెలుపుతో జాతీయ స్థాయిలో సైతం ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులు అయ్యారు. అయితే గత ఏడాదిగా జనసేనకు సంబంధించి సభలు జరగలేదు. పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెల 30న విశాఖలో జనసేన భారీ బహిరంగ సభ జరగనుంది. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్.

పాలనలో తనదైన మార్క్..
గత ఏడాది కాలంగా ప్రభుత్వంలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కీలకమైన ఐదు మంత్రిత్వ శాఖలతో తనదైన మార్కు చాటారు. చాలా రకాల మార్పులు తీసుకొచ్చారు. వాస్తవానికి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్. మంత్రిగా కూడా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే శాఖలపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేశారు. పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో భాగంగా.. పల్లెల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. నాలుగు వేల కోట్ల రూపాయలతో పల్లె పండుగ పనులు చేపట్టి గ్రామాల స్వరూపాన్ని మార్చారు. గిరిజనులపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన చేశారు. కుంకీ ఏనుగులను రప్పించి.. ఏనుగుల సమస్యకు చెక్ చెప్పారు. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అదే సమయంలో జనసేనకు చెందిన మరో మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం తనదైన ముద్ర చాటుకున్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందిస్తూ వస్తున్నారు. మరో జనసేన మంత్రి కందుల దుర్గేశ్ సైతం పర్యాటక శాఖలో అనేక రకాలుగా పథకాలు తీసుకొచ్చారు. సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా కూడా.. సినీ పరిశ్రమకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొని అభినందనలు అందుకున్నారు.

విశాఖ సభలో కీలక నిర్ణయాలు..
అయితే తొలి ఏడాది పాలనపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్.. సమాంతరంగా తన వృత్తి అయిన సినిమాలను పూర్తి చేశారు. అందుకే ఇప్పుడు పార్టీ పై ఫుల్ ఫోకస్ చేశారు. విశాఖలో ఈనెల 30న జనసేన విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 15 వేల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 2029 ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ, జనసేన చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సభలో వెల్లడించనున్నారు. మరో 15 ఏళ్ల పాటు పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెబుతుండగా.. సొంతంగానే జనసేన ఎదిగేందుకు కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తూనే.. దానికి ప్రత్యామ్నాయంగా జనసేన ను తీర్చిదిద్దేందుకు పవన్ నడుము బిగించినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో తెలంగాణలో అనుసరించాల్సిన వైఖరిపై కూడా పవన్ మనసు విప్పి మాట్లాడుతారని సమాచారం. ఏపీలో జనసేన అంచనాలు పెంచే విధంగా విశాఖ సభ ఉండబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Exit mobile version