Hyderabad trending video: హైదరాబాద్.. విశ్వనగరం.. గడిచిన పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అనేక కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. దీంతో వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఇక హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది చారిత్రక కట్టడం చార్మినార్, గోల్కొండ ఫోర్ట్. కానీ ఓ ఇప్పుడు హైటెక్‌సిటీ, సైబర్ టవర్, తీగల వంతెన, ఇలా అనేకం ఉన్నాయి. హైదరాబాద్‌కు విమానంలో వస్తున్న ఓ ప్రయాణికుడు రాత్రివేళ.. నింగి నుంచి తీసిన వీడియ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అతుల్ మహరాజ్ ఎక్స్‌లో పోస్టు చేసిన ఈ వీడియోను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ కారణంగా పుణె నుంచి వస్తున్న ఒక విమానం జంగావ్ వైపు మళ్లించబడి. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరుకునే క్రమంలో ఒక ప్రయాణికుడికి అనూహ్యమైన అనుభవాన్ని అందించింది. ఈ ఆలస్యం విమాన ప్రయాణాన్ని ప్రభావితం చేసినప్పటికీ, ఆకాశం నుంచి ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌ను చూసే అవకాశం ఈ ప్రయాణాన్ని అద్భుతంగా మార్చింది. ఇదే విషయాన్ని ఎక్స్‌లో షేర్ చేశాడు.
అద్భుతంగా విశ్వనగరం..
అతుల్ మహరాజ్ పోస్టు చేసిన ఈ వీడియోలో విశ్వనగరం అందం రాత్రివేళ చూడడానికి రెండు కళ్లు చాలవు. విద్యుత్ కాంతుల వెలుగుల్లో నింగినుంచి హైదరాబాద్ అద్భుతంగా కనిపిస్తోంది. ఇక సదరు ప్రయాణికుడు ఈ దృశ్యాన్ని వీడియోత తీస్తుండగా గత ప్రభుత్వం నిర్మించిన తీగల వంతెన అద్భుతంగా కనిపించింది. ఈ ఐకానిక్ చూసి ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు అదే విశయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. దీనిని మాజీ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేసి ఎంతందంగా ఉంది కదూ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
స్పందిస్తున్న నెటిజన్లు..
వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. హైదరాబాద్ నిజంగా అద్భుతం అని కొందరు, వావ్ హమారా హైదరాబాద్ అని ఒకరు కామెంట్ చేశారు. చాలా అందంగా ఉంది అని మరికొందరు కామెంట్ చేశారు.
Ain’t that beautiful https://t.co/sFOIZUKrxp
— KTR (@KTRBRS) August 26, 2025