Site icon Desha Disha

Hyderabad Richest People: హైదరాబాద్‌లో టాప్‌ ధనవంతులు వీరే.. ఏయే రంగాల్లో.. – Telugu News | Top Richest People in Hyderabad 2025: Net Worth

Hyderabad Richest People: హైదరాబాద్‌లో టాప్‌ ధనవంతులు వీరే.. ఏయే రంగాల్లో.. – Telugu News | Top Richest People in Hyderabad 2025: Net Worth

Hyderabad Richest People: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ధనవంతులున్నారు. అలాగే మన దేశంలో కూడా చాలా మంది ధనవంతులున్నారు. వారి వ్యాపారంతో దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే ఇక్కడ కూడా ధనవంతులు భారీగా ఉన్నారు. వివిధ రంగాల్లో వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ మరింత సంపాదన వెనుకేసుకొస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బిజినెస్‌ రంగంలో వేగంగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు ఒక బిజినెస్‌ హబ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భాగ్యనగరం ప్రత్యేకించి ఫార్మాస్యూటికల్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి రంగాలలో తన ముద్రను వేస్తూ ఎంతో మంది బిలియనీర్లుగా తీర్చిదిద్దుతోంది. హైదరాబాద్‌ నగరం వ్యాపారాలకు నిలయంగా మారింది. హైదరాబాద్‌ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది.

ఇది కూడా చదవండి: Gold Price: పండగకు ముందు షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై భారీగా పెంపు!

  1. మొదటగా దివిస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి. ఈ పేరు తప్పక ప్రస్తావించాలి. ఆయన నికర విలువ ప్రస్తుతం 9.2 బిలియన్ల అమెరికన్ డాలర్లు. దివిస్ లాబొరేటరీస్ ప్రపంచవ్యాప్తంగా క్రియాశీల ఔషధ పదార్థాలు సరఫరా చేసే అగ్రశ్రేణి కంపెనీలలో ఒకటిగా నిలిచింది.
  2. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్: ఇక భారతీయ ఔషధ రంగంలో ప్రముఖమైన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కూడా హైదరాబాద్‌ వ్యాపార కీర్తిని పెంచిన సంస్థలలో ఒకటి ఉంది. ఈ సంస్థ యజమానులు అయిన రెడ్డి కుటుంబం ప్రస్తుతం సుమారు 3.67 బిలియన్ల డాలర్ల నికర విలువను కలిగి ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే మెడిసిన్స్ తయారీలో ఈ సంస్థ ప్రత్యేక కృషి చేస్తోంది.
  3. ఇవి కూడా చదవండి

  4. హెటెరో గ్రూప్: ఎయిడ్స్‌తో పాటు అనేక వ్యాధులకు అవసరమైన యాంటీ-రెట్రోవైరల్ ఔషధాలు తయారు చేసే హెటెరో గ్రూప్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సాధించింది. ఈ సంస్థ చైర్మన్ బి. పార్థసారధి రెడ్డి నికర విలువ 3.95 బిలియన్ల డాలర్లు. ఆరోగ్యరంగంలో అందిస్తున్న సేవల వల్ల హెటెరో గ్రూప్ దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది.
  5. బయోలజికల్‌: ఇక వ్యాక్సిన్ తయారీ రంగంలో కీలకంగా ఉన్న మరో కంపెనీ బయోలాజికల్ E. దీన్ని మహిమా దాట్ల విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఒక వ్యక్తిగతంగా నిర్వహించే ఈ సంస్థ దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా వ్యాక్సిన్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. మహిమా దాట్ల వ్యక్తిగత నికర విలువ ప్రస్తుతం 3.3 బిలియన్ల డాలర్లు.
  6. అరబిందో ఫార్మా: ఇక ఈ ఫార్మా సహ వ్యవస్థాపకుడు పి.వి. రాంప్రసాద్ రెడ్డి కూడా భాగ్యనగరంలో వ్యాపారం రంగంలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉన్నారు. ఆయన నికర విలువ ప్రస్తుతం 3.9 బిలియన్ల డాలర్లు. ఈ కంపెనీ ఔషధ తయారీలోనే కాకుండా, గ్లోబల్ మార్కెట్‌లో విస్తరించడంలోనూ ముఖ్యమైన స్థానం సంపాదించింది. ఇలాంటి వారి వల్ల నగరం కొత్త అవకాశాలకు కేంద్రబిందువుగా మారింది.

ఇది కూడా చదవండి: Indian Currency: 100, 200 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు కీలక ఆదేశాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version