దిన ఫలాలు (ఆగస్టు 26, 2025): మేష రాశికి చెందిన ఉద్యోగులకు తమ పై అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకునే అవకాశముంది. వృషభ రాశి వారికి రాబడి పెరగడానికి సమయం అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికపరంగా మీ ప్రయత్నాలు, నిర్ణయాలు ఫలిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. పని ఒత్తిడి బాగా పెరిగి విశ్రాంతి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. రాబడి పెరగడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చ వద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ వార్తలు వింటారు. ముఖ్యంగా జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో పిల్లల వల్ల కొద్దిపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బంధుమిత్రులతో మాటలు, చేతల విషయంలో తొందరపాటు పనికి రాదు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. పని భారంతో ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది శ్రమతో లాభాలు, రాబడి పెంచుకుంటారు. ఇంటా బయటా మాట విలువ పెరుగుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తోబుట్టువులతో ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవ సరం ఉంది. ఆస్తి, ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు చాలావరకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులో దైవ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి స్థాయిలో చక్కబెడతారు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. షేర్లు, తదితర ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో రాబడికి లోటుండదు కానీ ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. కుటుంబ జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవ హారాలు, పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తోబుట్టువులతో వివాదాలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆదాయానికి లోటు ఉండదు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల బాగా లబ్ధి పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేయడంలో శ్రమాధిక్యత ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలను అధిగమించి లాభాల బాటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. ఇంటా బయటా మీ సలహాలు, సూచనల వల్ల అటు అధికారులు, ఇటు బంధుమిత్రులు బాగా లాభపడతారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.