Fever: జ్వరం ఉంటే చికెన్‌, మటన్‌ తింటే ఏమౌతుంది..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే… – Telugu News | Can we eat chicken during fever in telugu news

అనారోగ్యంతో ఉన్నప్పుడు అన్ని పోషకాల సమతుల్యతతో కూడిన సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ రోగనిరోధక శక్తి ఇప్పటికే బలహీనంగా ఉంది. కాబట్టి, అటువంటి పరిస్థితులలో వైద్యులు ఎల్లప్పుడూ కడుపుకు తేలికగా ఉండే ఆహారాన్ని తినమని సిఫార్సు చేస్తుంటారు. అనారోగ్యం, జ్వరం ఉన్న సమయంలో చికెన్, మటన్‌ వంటి ఆహారం తినడం గురించి ప్రజలకు ఒక సాధారణ సందేహం ఉంటుంది. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా జ్వరంతో ఉన్నప్పుడు చికెన్, మటన్‌ తినవచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే…

ప్రధానంగా జ్వరం వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. అయితే, ఈ సమయంలో చికెన్‌, మటన్‌ తింటే హెవీ లోడ్ అవుతుంది. అది జీర్ణమవ్వడానికి కూడా బాగా సమయం పడుతుంది.
ఇది ఒక్కోసారి కడుపు సమస్యలకు కూడా కారణమవుతాయి. అయితే, ఇది లివర్‌ పనితీరును కూడా కుంటుపడేలా చేస్తుంది. అందుకే జ్వరం ఉన్నప్పుడు నాన్‌ వెజ్‌కు దూరంగా ఉండాలి అంటారు. అయితే వేరే కారణాల వల్ల కూడా కమెర్లు వచ్చిన సందర్భాలు అధికం. ఎక్కువ బయట ఫుడ్‌, ఆయిలీ తినేవారికి ఈ ప్రమాదం ఉంటుంది.

కాబట్టి, జ్వరంతో బాధపడుతున్నప్పుడు మీరు తినగలిగే అత్యుత్తమ వంటకం చికెన్ సూప్. వేడి ద్రవం మీ శరీరాన్ని అనారోగ్యం నుండి నయం చేస్తుంది. చికెన్ లోని ప్రోటీన్ కంటెంట్ మీ శరీరానికి కోలుకోవడానికి తగినంత శక్తిని ఇస్తుంది. చికెన్ సూప్ ద్రవాలు, ఎలక్ట్రోలైట్లకు అద్భుతమైన మూలం. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఈ వేడి ద్రవం సహజమైన డీకంజెస్టెంట్ కూడా. ఇది మీ దగ్గు, ముక్కు మూసుకుపోవడాన్ని తగ్గిస్తుంది. ఇవి వాటికి కారణమయ్యే న్యూట్రోఫిల్స్ చర్యను నిరోధించడం ద్వారా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[

Leave a Comment