Caste feeling in Film Industry: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు స్టార్ హీరోలుగా మారాలనే దృఢ సంకల్పంతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు. కొంతమందికి మాత్రం ఇక్కడ చాలా మంచి గుర్తింపు లభిస్తే మరి కొంతమందికి మాత్రం వాళ్ళు ఆశించిన మేరకు సక్సెసులైతే రావడం లేదు. దానివల్ల వాళ్ళు ఎంత తొందరగా ఇండస్ట్రీకి వచ్చారో అంతే తొందరగా ఇక్కడి నుంచి ఫెడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది… అందుకే ప్రతి నటుడు తను చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తూ ఉంటాడు. అయినప్పటికి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ…కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఎవరికి సక్సెస్ వస్తుందో ఎవ్వరు టాప్ పొజిషన్ లో ఉంటారు అనేది చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని… కొంతమంది సక్సెస్ లను సాధించినప్పటికి వాళ్లకు స్టార్ స్టేటస్ మాత్రం రాకుండా పోతోంది. ఇక మరికొంతమంది హీరోలు మాత్రం సక్సెస్ లు లేకపోయిన కూడా ఇండస్ట్రీలో సర్వైవల్ అవుతూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి కారణం ఏంటి అనే ధోరణి లో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎలాంటి హెల్ప్ అయితే లభించడం లేదు. ఎవరికి వాళ్లు ఓన్ గా తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ప్రేక్షకులను మెప్పించినప్పుడు మాత్రమే వాళ్లకు విపరీతమైన మార్కెట్ అయితే క్రియేట్ అవుతోంది…సపోర్టుతో వచ్చిన వాళ్లకు మాత్రం ఇక్కడ చాలా ఈజీగా అవకాశాలు వస్తాయి. వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కొంత ఎక్కువ సమయం అయితే ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్ అయిన మరో సినిమాతో ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే లభిస్తోంది… ఇక సపోర్ట్ అంటే ఏంటి అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు.
నిజానికి ఇండస్ట్రీలో సపోర్ట్ అంటే ఏమి ఉండదు. ఒకటి హీరోలా కొడుకులు, మనవలుగా రావడం. అంటే వారసత్వ బ్యాగ్రౌండ్ ఉండటం… లేదంటే స్టార్ హీరోలు ఉన్న క్యాస్ట్ తో ఒక యాంగ్ హీరో ఇండస్ట్రీకి రావడం…అంటే స్టార్ హీరో క్యాస్ట్ యంగ్ హీరో క్యాస్ట్ ఒకటవ్వడం వల్ల వాళ్ళిద్దరికీ మంచి కనెక్టివిటీ అయితే కుదురుతుంది.
దానివల్ల వీడు మనోడే అనే ఫీల్ తో స్టార్ హీరోలు వాళ్లను ఎంకరేజ్ చేస్తూ కొంత మంది ప్రొడ్యూసర్లను ఆ హీరో తో సినిమా చేయండి అని రికమెండ్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి… అందుకే ఇండస్ట్రీలో ఒకటి రెండు క్యాస్ట్ ల వాళ్ళు మాత్రమే టాప్ పొజిషన్లో ఉన్నారు. మిగతా వాళ్లంతా టాలెంట్ ఉన్న కూడా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఇంకా స్ట్రగులింగ్ లోనే గడుపుతున్నారు. ఎంత టాలెంట్ ఉన్న కూడా వాళ్లకు పెద్ద అవకాశాలు మాత్రం రావడం లేదు…
కొంతమంది హీరోలు మాత్రం ఇండస్ట్రీలో ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెబుతున్నప్పటికి ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఇండస్ట్రీలో కచ్చితంగా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. ఎవరి క్యాస్ట్ వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. తప్ప మిగతా వారిని ఎవరు పట్టించుకోవడం లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది…