Site icon Desha Disha

AP Job Notification 2025: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే? – Telugu News | AP Medical and Health Department released Recruitment 2025 Notification for 185 doctor Posts

AP Job Notification 2025: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే? – Telugu News | AP Medical and Health Department released Recruitment 2025 Notification for 185 doctor Posts

అమరావతి, ఆగస్ట్‌ 26: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 185 వైద్యుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్ణణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్‌ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌ అర్హతతో 155 మంది వైద్యులను ఎంపిక చేస్తారు. ఇక స్పెషలిస్టు వైద్యుల పోస్టులు 30, టెలిమెడిసిన్‌ హబ్‌ పోస్టులు 13, గైనకాలజిస్ట్‌ పోస్టులు 3, చిన్న పిల్లల వైద్యుల పోస్టులు 14 వరకు ఉన్నాయి. ఈ మేరకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 25 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 10, 2025వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇతక వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల జాబితా వచ్చేసింది..

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా తొలి విడత ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు జాబితా విడుదలైంది. ఈ మేరకు విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్‌ కోటా సీట్ల జాబితాను ప్రకటించింది. సీట్ల వివరాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 25 మధ్యాహ్నం 3 గంటల నుంచి రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.10,600 చెల్లించేందుకు అవకాశం కల్పించింది. అనంతరం సీట్లు పొందిన విద్యార్ధులు తమకు సీట్లు కేటాయించిన పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు.

ఆగస్టు 29 సాయంత్రం 4 గంటల్లోగా సీట్లు వచ్చినవారంతా ఆయా మెడికల్‌ కాలేజీల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో రిపోర్టు చేయాలని సూచించారు. మరోవైపు సెప్టెంబరు 5 నుంచి ఎంబీబీఎస్‌ ఫస్ట్‌ ఇయర్ తరగతులు ప్రారంభం కానున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Exit mobile version