Site icon Desha Disha

8 ఏళ్లుగా చిక్కకుండా తిరుగుతున్న ముఠా.. ఎట్టకేలకు చెక్‌పెట్టిన పోలీసులు.. ఇంతకు ఏం చేశారంటే! – Telugu News | Police arrest four people involved in street robbery in Nandyal district

8 ఏళ్లుగా చిక్కకుండా తిరుగుతున్న ముఠా.. ఎట్టకేలకు చెక్‌పెట్టిన పోలీసులు.. ఇంతకు ఏం చేశారంటే! – Telugu News | Police arrest four people involved in street robbery in Nandyal district

రోడ్లపై పక్కన పొదల్లో దాక్కొని.. అటుగా వెళ్లే జనాలపై దాడులకు పాల్పడుతూ అందినకాడికి బంగారం, డబ్బు దోచుకుంటూ.. జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ దోపిడి ముఠాకు నంద్యాల పోలీసులు చెక్‌పెట్టారు. ఈ ముఠాను పాణ్యం పిన్నాపురం కొండల్లో నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలంగా నంద్యాల, కర్నూలు, గుంటూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో పలు చోరిలకు పాల్పడుతూ.. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. ఈ క్రమంలో వారిపై ఫోకస్‌ పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో పాణ్యంలోని పిన్నాపురం కొండల్లో నలుగురు దారిదోపిడి దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 10.35 లక్షల విలువగల బంగారు, వెండి నగలను నాలుగు పిడిబాకులు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

పట్టబడిన నిందితుల్లో నంద్యాల జిల్లాకు చెందిన దాసరి అంకన్నపై 34 కేసులు, హరిశ్చంధ్ర సత్యపై 14 కేసులు, చిన్న హుస్సెనిపై 10 కేసులు, దాసరి జమ్ములుపై12 కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఎనిమిది సంవత్సరాల కాలంగా ఐదు జిల్లాల పోలీసులకు చుక్కలు చూపిస్తూ చోరిలకు పాల్పడుతున్న ముఠా పట్టుకున్న పోలీసులకు ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఎఎస్పి జావళి రివార్డులు అందించి ప్రోత్సహించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version