Site icon Desha Disha

6G Network: 4 నెలల్లో 6G వస్తోంది.. ఇక పండగే పండగ..

6G Network: 4 నెలల్లో 6G వస్తోంది.. ఇక పండగే పండగ..
6G Network: 4 నెలల్లో 6G వస్తోంది.. ఇక పండగే పండగ..

భారత్‌లోకి 6G సేవలు రాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ అంశంపై ఆయన కీలక ప్రకటన చేశారు. 2025 చివరి నాటికి దేశీయంగా తయారు చేసిన మొదటి సెమీకండక్టర్ చిప్‌ను విడుదల చేయనుందని, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో దేశం వేగంగా ముందుకు వెళ్తోందని ఆయన వెల్లడించారు. గత ఐదు నుండి ఆరు దశాబ్దాలుగా భారతదేశం సెమీకండక్టర్ రంగంలో అనేక అవకాశాలను కోల్పోయిందని మోదీ అన్నారు. “ 50-60 సంవత్సరాల క్రితమే భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ ప్రారంభం కావాల్సింది. కానీ, మనం ఆ అవకాశాన్ని కోల్పోయాం. అయితే, ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నం చేయటంతో… నేడు మనదేశానికి సెమీకండక్టర్ పరిశ్రమలు రావడం ప్రారంభించాయి. ఈ ఏడాది చివరికి మొదటి మేడ్-ఇన్-ఇండియా చిప్ మార్కెట్లోకి రానుంది” అని ప్రధాని పేర్కొన్నారు. దేశ సాంకేతిక రంగ వేగాన్ని ప్రస్తావిస్తూ.. మేడ్ ఇన్ ఇండియా 6Gపై వేగంగా పని చేస్తున్నాం అని ప్రధాని వెల్లడించారు.

Exit mobile version