Site icon Desha Disha

లిథువేనియా ప్రధానిగా కార్మిక నాయకురాలు

లిథువేనియా ప్రధానిగా కార్మిక నాయకురాలు

దేశ పగ్గాలు చేపట్టిన ఇంగా రుగినియెన్‌
విల్నియస్‌: లిథువేనియా దేశానికి కొత్త ప్రధానిగా ఇంగా రుగినియెన్‌ మంగళవారం ఎన్నికయ్యారు. ఆమె ట్రేడ్‌ యూనియన్‌ కాన్ఫెడరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు సెంటర్‌ లెఫ్ట్‌ సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీలో చేరారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కార్మిక నాయకురాలికి దేశ పగ్గాలు కట్టబెట్టేందుకు శాసనసభులు ఆమోదం తెలిపారు. వ్యాపార కార్యకలాపాల్లో అవకతవకలకు సంబంధించి విచారణ క్రమంలో గింటౌటస్‌ పలుకాస్‌ రాజీనామా చేశారు. అనంతరం ఇంగా రుగినియెస్‌ ఈ పదవీ బాధ్యతలు చేపట్టారు. కొత్త ప్రధానిగా రుగినియెస్‌ పేరును అధ్యక్షులు గిటానస్‌ నౌసెదా ప్రతిపాదించారు. పార్లమెంటులో ఓటింగ్‌ అనంతరం నూతన ప్రధానిగా రుగినియెస్‌ పగ్గాలు చేపట్టారు. సభలో మాట్లాడుతూ సుస్థిరతను పునరుద్ధరిస్తానని సంకల్పించారు. ఓటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రభుత్వం పనిచేస్తుందని హామీనిచ్చారు. ఇంగా రుగినియెన్‌ 2018 నుంచి 2024 వరకు లిథువేనియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాన్ఫెడరేషన్‌ చైర్‌ పర్సన్‌్‌గా ఉన్నారు. 202324లో యూరోపియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాన్ఫెడరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేశారు.12 డిసెంబర్‌ 2024 నుంచి లిథువేనియా సామాజిక భద్రతకార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. గింటౌటాస్‌ పలుకాస్‌ రాజీనామా తర్వాత ప్రధాన మంత్రి అభ్యర్థిగా రుగినియెన్‌ను సోషల్‌ డెమోక్రాట్లు నామినేట్‌ చేశారు. ఆమెను నూతన ప్రధానిగా అధ్యక్షుడు ప్రతిపాదించగా, చట్టసభ ఆమోదించింది. దీంతో ఆమె ప్రమాణ స్వీకారంచేశారు.

Exit mobile version