Site icon Desha Disha

నైజీరియాలో పట్టాలు తప్పిన రైలు..అనేక బోగీలు బోల్తా.. ప్రయాణీకుల పరిస్థితి ఎలా ఉందంటే.. – Telugu News | Abuja Kaduna Train Accident Derailment Causes Panic, No Fatalities Reported

నైజీరియాలో పట్టాలు తప్పిన రైలు..అనేక బోగీలు బోల్తా.. ప్రయాణీకుల పరిస్థితి ఎలా ఉందంటే.. – Telugu News | Abuja Kaduna Train Accident Derailment Causes Panic, No Fatalities Reported

నైజీరియాలో కడునా నుండి అబుజా ప్రాంతానికి ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ రైలు మంగళవారం పట్టాలు తప్పింది. పలు బోగీలు బోల్తా పడ్డాయి. ఊహించని రీతిలో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం అబుజా నుండి కడునాకు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అనేక బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనతో దానిలో ఉన్న ప్రయాణీకుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో కడునాకు వెళ్లే మార్గంలో రైలు అబుజా నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రముఖ కారిడార్‌లో ఈ సంఘటన జరిగిందని తెలిసింది. ఈ సంఘటన కారణంగా ప్రయాణీకులు భద్రత కోసం పరుగులు తీశారు. చాలామంది ఆ దృశ్యాన్ని గందరగోళంగా, భయానకంగా అభివర్ణించారు.

ప్రమాదవశాత్తు రైలు పట్టాలు తప్పిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీంతో పట్టాలు తప్పిన క్యాబిన్ల నుంచి ప్రయాణికులు బయటకు పరుగెత్తడంతో గందరగోళం నెలకొంది. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డట్టు తెలుస్తోంది. బోల్తా పడిన క్యాబిన్‌ల నుండి బయటకు రావడానికి ప్రయత్నించిన ప్రయాణికులకు స్థానికులు సాయం చేశారు. ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా నిర్ధారణ కాలేదు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

నైజీరియా రైల్వే కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కయోడ్ ఒపైఫా మంగళవారం మా కరస్పాండెంట్‌తో టెలిఫోన్‌లో ఈ సంఘటనను ధృవీకరించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Exit mobile version