War 2 Losses: ఎల్లప్పుడూ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల గురించి మాత్రమే కాదు, అప్పుడప్పుడు అత్యధిక నష్టాలను రాబట్టిన సినిమాల గురించి కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఈ ఒక్క ఏడాదిలోనే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అత్యధిక నష్టాలను రాబట్టిన సినిమాలు రెండు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు, సినీ ఇండస్ట్రీ ఏ రేంజ్ సంక్షోభం లో ఉంది అనేది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఇదే పరిస్థితి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఇలా వందల కోట్ల నష్టాలను కలిగించిన సినిమాలు, కరోనా లాక్ డౌన్ తర్వాతనే వచ్చాయి అనే వాస్తవం. రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) ‘వార్ 2′(War 2 Movie) చిత్రం అక్షరాలా 150 కోట్ల రూపాయిల నష్టాలను మిగిలించింది. అంటే 400 కోట్ల రూపాయిల గ్రాస్ నష్టం అన్నమాట. ఇదే ప్రస్తుతం ఇండియా లో టాప్ 1 నష్టాలను దక్కించుకున్న చిత్రం.
Also Read: ‘అగ్నిపరీక్ష’ ప్రేక్షకుల ఓటింగ్ లో దూసుకుపోతున్న టాప్ 2 కంటెస్టెంట్స్ వీళ్ళే!
ఇక ఆ తర్వాత రెండవ స్థానం లో ‘కంగువ’ చిత్రం నిల్చింది. తమిళ హీరో సూర్య నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కి గత ఏడాది భారీ హైప్ తో విడుదలై డిజాస్టర్ టాక్ ని తెచ్చుకొని, 135 కోట్ల రూపాయిల నష్టాలను మూటగట్టుకొని ఆల్ టైం రికార్డు ని గత ఏడాది నెలకొంది. ఇప్పట్లో ఈ రికార్డు బద్దలు అవ్వడం కష్టంమేమో అని అనుకున్నారు. ఏడాది తిరగకముందే ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. ఈ రెండు చిత్రాల తర్వాత ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చిత్రం 125 కోట్ల రూపాయిల నష్టం లో మూడవ స్థానం లో నిలబడగా, నాల్గవ స్థానం లో 120 కోట్ల రూపాయిల నష్టం తో నిల్చింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ ఒక్క ఏడాది లో ‘వార్ 2 ‘ మరియు ‘గేమ్ చేంజర్’ మిగిలించిన నష్టాల విలువ 450 కోట్ల వరకు ఉంటుందట. ఇక ఐదవ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’ చిత్రం 90 కోట్ల నష్టం తో లిస్ట్ లో స్థానాన్ని పదిల పరుచుకుంది.
ఒకప్పుడు కలెక్షన్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు చూడండి నష్టాల గురించే మాట్లాడుకుంటున్నాం. ఇండస్ట్రీ ఆశలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం మీదనే ఉన్నాయి. అయితే బయ్యర్స్ దగ్గర ఈ సినిమా బిజినెస్ ని చేయడానికి డబ్బులు లేవు. నిర్మాతలు వాళ్ళ నుండి తీసుకున్న అడ్వాన్స్ ని తిరిగి ఇవ్వడం లేదు. బిజినెస్ లేకపోవడం వల్ల ఈ సినిమా బిజినెస్ ఇంకా అనేక ప్రాంతాల్లో క్లోజ్ అవ్వలేదు. కానీ ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఇండస్ట్రీ కి నెల రోజులు ఒక పండుగే అని చెప్పొచ్చు. నష్టాల నుండి కొంతమేరకు లాభాల్లోకి రావొచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.