Site icon Desha Disha

త్వరలో కిమ్‌తో ట్రంప్‌ భేటీ!

త్వరలో కిమ్‌తో ట్రంప్‌ భేటీ!

వాషింగ్టన్‌/సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో ఈ ఏడాది భేటీ కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆకాంక్షించారు. దక్షిణ కొరియాతో వాణిజ్య చర్చలకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ అమెరికాలో పర్యటించారు. శ్వేతసౌధ్యంలో ట్రంప్‌ ఆయనకు స్వాగతం పలికారు. ఇద్దరు అధినేతలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఓవల్‌ కార్యాలయంలో విలేకరులతో సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ ‘సమీప భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలంగా సమయంలో కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో సమావేశం కోసం ఎదరు చూస్తున్నా’ అని అన్నారు. ట్రంప్‌ను శాంతి దూతగా లీ జే మ్యూంగ్‌ ప్రశంసించారు. నౌకల నిర్మాణంతో పాటు ఇతర తయారీ రంగాల్లో అమెరికాతో సహకారాన్ని మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అమెరికా సీనియర్‌ అధికారులతో కలిసి ఆయన బిజినెస్‌ ఫోరంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో 20కుపైగా అమెరికా కంపెనీలు, దక్షిణ కొరియా కంపెనీలకు చెందిన సీఈఓలు, అధికార ప్రతినిధులు హాజరయ్యారు. ఇదిలావుంటే, తమ అధినేతతో భేటీని ట్రంప్‌ కోరడంపై ఉత్తర కొరియా స్పందించలేదు. అయితే దక్షిణ కొరియాతో కలిసి అమెరికా సైనిక విన్యాసాలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిరచింది. కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకోనే ప్రయత్నంగా దుయ్యబట్టింది. ఆ ప్రాంత దేశాలను లక్ష్యంగా చేసుకోవడమే అమెరికా ఉద్దేశంగా పేర్కొంది.

Exit mobile version