Site icon Desha Disha

ఓ మై గాడ్ ! చూస్తుండగానే సరస్సులో కూలిపోయిన హెలికాప్టర్..10 సెకన్లలో అంతా మాయం.. – Telugu News | French Helicopter Crash Into Lake Video Goes Viral

ఓ మై గాడ్ ! చూస్తుండగానే సరస్సులో కూలిపోయిన హెలికాప్టర్..10 సెకన్లలో అంతా మాయం.. – Telugu News | French Helicopter Crash Into Lake Video Goes Viral

హెలికాప్టర్ కూలిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్యాసింజర్ హెలికాప్టర్ కాదు, అగ్నిమాపక శాఖకు సంబంధించిన హెలికాప్టర్. అడవిలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పడానికి సరస్సు నుండి నీటిని నింపుతున్న సమయంలో హెలికాప్టర్ కూలిపోయి నీటిలో మునిగిపోయింది. అదృష్టవశాత్తూ హెలికాప్టర్‌లోని సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. అక్కడ ఉన్న వ్యక్తులు ఈ అరుదైన, షాకింగ్ క్షణాన్ని కెమెరాలో బంధించారు. దానిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

ఫ్రాన్స్‌లో అగ్నిమాపక శాఖకు చెందిన H125 Écureuil హెలికాప్టర్ అడవిలో చెలరేగిన మంటలను ఆర్పడానికి సరస్సు నుండి నీటిని నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వాస్తవానికి, హెలికాప్టర్ నీటిని తీసుకోవడానికి సరస్సుపైకి వెళుతుండగా, అది అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోస్పోర్డెన్ (వాయువ్య ఫ్రాన్స్) సరస్సులో పడిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ మొత్తం సంఘటనను అక్కడ ఉన్న వ్యక్తులు కెమెరాలో బంధించారు. 23 సెకన్ల నిడివి గల ఈ క్లిప్‌లో, హెలికాప్టర్‌కు ఒక పెద్ద డ్రమ్ లాంటిది కట్టి ఉంది. హెలికాప్టర్ నెమ్మదిగా సరస్సుపైకి ఎగిరి దానిని నింపేందుకు ప్రయత్నించారు. డ్రమ్ ను నీటిలో ముంచడానికి అది కొద్దిగా కిందికి దిగిన వెంటనే, పైలట్ ఉన్నట్టుండి నియంత్రణ కోల్పోతాడు. ఆ మరుక్షణంలో అంతా మారిపోయింది.. మొదట హెలికాప్టర్ ఇటూ అటూ ఊగిపోయింది.  తరువాత అకస్మాత్తుగా దాని బ్లేడ్‌లు నీటిని ఢీకొంటాయి. దాంతో హెలికాఫ్టర్‌ బాగా దెబ్బతి సరస్సులో మునిగిపోతుంది.

వీడియో ఇక్కడ చూడండి..

షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిని ఆగస్టు 25న X (మునుపటి ట్విట్టర్) హ్యాండిల్ @airmainengineer పోస్ట్ చేశారు. అతను క్యాప్షన్‌లో ఇలా వ్రాశాడు – ఫ్రాన్స్‌లోని బ్రెటాగ్నే ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించినది ఈ దృశ్యం అని రాశారు. ఇక్కడ ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే విమానంలో ఉన్న ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Exit mobile version