Site icon Desha Disha

Viral: ఉబ్బిపోయి ఊపిరాడక అస్పత్రికి.. టెస్టులు చేయగా.. డాక్టర్లకు CT స్కాన్‌లో

Viral: ఉబ్బిపోయి ఊపిరాడక అస్పత్రికి.. టెస్టులు చేయగా.. డాక్టర్లకు CT స్కాన్‌లో
Viral: ఉబ్బిపోయి ఊపిరాడక అస్పత్రికి.. టెస్టులు చేయగా.. డాక్టర్లకు CT స్కాన్‌లో

మెడికల్ చరిత్రలో ఎన్నో సవాళ్లతో కూడుకున్న కేసులను సాల్వ్ చేస్తుంటారు డాక్టర్లు. తన కెరీర్‌లో ఛాలెంజింగ్‌గా అనిపించిన కేసులను మెడికల్ జర్నల్స్‌లో పొందుపరుస్తారు కొందరు డాక్టర్లు. అలాంటి ఓ కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. వివరాల్లోకి వెళ్తే.. ఓ 85 ఏళ్ల వ్యక్తి తన శరీరం ఉబ్బిపోయి.. తీవ్రమైన నొప్పి, రక్తస్రావంతో ఆస్పత్రికి వచ్చాడు. హుటాహుటిన సదరు రోగిని.. అతడి కూతురు హాస్పిటల్‌లో అడ్మిట్ చేసింది. దక్షిణ ఇటలీలోని లెక్సేలో సదరు రోగి ఇంటికి పారామెడిక్స్ చేరుకొని.. అతడికి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. అతని శరీరంలోకి ఓ లైట్ బల్బ్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే లెక్సేలో ఉన్న వీటో ఫాజీ హాస్పిటల్‌లోని అత్యవసర వార్డుకు తరలించారు.

CT స్కాన్ చేయగా.. అతడి శరీరంలో లైట్ బల్బ్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే దాని వల్ల ఆ బాడీ పార్ట్ చుట్టూ ఇన్ఫెక్షన్ కావడమే కాకుండా.. అటుగా ఉన్న నెర్వ్ సిస్టం దెబ్బతిందని డాక్టర్లు తెలిపారు. ఆగష్టు 19న ఈ ఘటన అత్యంత నాటకీయంగా జరిగింది. డాక్టర్లు సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి.. బల్బును సున్నితంగా ఎండోస్కోపిక్ ద్వారా తొలగించారు. అలాగే సదరు రోగి మానసిక స్థితి బాగోలేదని.. కొద్దిరోజులు పర్యవేక్షణలో ఉంచి ఆ తర్వాత అతడ్ని డిశ్చార్జ్ చేశామని డాక్టర్లు అన్నారు.

Exit mobile version