వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు చతుర్థ స్థానంలో రవితో కలవబోతున్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలగడం, జీతభత్యాలు పెరగడం వంటివి జరుగుతాయి. కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అత్యధికంగా లాభిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
మిథునం: రాశ్యధిపతి బుధుడు తృతీయ స్థానంలో రవితో కలవడం వల్ల చవితి తర్వాత నుంచి ఈ రాశివారికి దశ తిరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.
కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. రవితో కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడి రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధి కారులు మీ సలహాలు సూచనల వల్ల బాగా లబ్ది పొందుతారు. పదోన్నతులకు, వేతనాల పెరు గుదలకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి ఉన్నతావకాశాలు అంది వస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.
సింహం: ఈ రాశిలోకి బుధుడు ప్రవేశించడంతో పాటు రాశ్యధిపతి రవితో కలుస్తున్నందువల్ల ఈ రాశివారికి వినాయక చవితి నుంచి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలగడానికి అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. సమాజంలో ఒక ప్రముఖుడుగా అందలాలు ఎక్కుతారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.
తుల: ఈ రాశికి లాభ స్థానంలో ప్రవేశించిన బుధుడు అదే రాశిలో రవితో కలవడం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహన యోగం పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభి వృద్ధి బాట పడతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో దశమాధిపతి బుధుడి ప్రవేశంతో పాటు, అక్కడ భాగ్యాధిపతి రవితో యుతి చెందడం వల్ల వినాయక చవితి నుంచి ఈ రాశివారి దశ తిరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది.