Site icon Desha Disha

Horoscope Today: వీరికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకట్రెండు శుభవార్తలు.. 12 రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today: వీరికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకట్రెండు శుభవార్తలు.. 12 రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
Horoscope Today: వీరికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకట్రెండు శుభవార్తలు.. 12 రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగి, పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి  మెరుగుపడు తుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందు తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం చాలావరకు బాగుంటుంది. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఇష్ట మైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని శుభవార్తలు అందుతాయి.  ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లలు బాగా వృద్దిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకున్న పనులన్నీ సకాలంలో సజావుగా పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు చాలా వరకు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి రంగం బాగా బిజీ అయిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెద్దల సలహాలు తీసుకుని వ్యాపారంలో ముందుకు దూసుకు వెడతారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందు తుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. కుటుంబం మీద ఖర్చు పెరుగు తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందు తాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. బంధువులు, కుటుంబ సభ్యులతో వివాదాలు, అపార్థాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ప్రయ త్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. చేపట్టిన వ్యవహారాలు, ప్రయ త్నాలు, పనులు,  చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఖర్చులు తగ్గించుకోవడం, ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. తోబుట్టు వులతో విభేదాలు తొలగిపోతాయి. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగాల్లో ఉన్నవారు ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అంచ నాలకు తగ్గట్టుగా లాభాలు అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. రాజకీయ ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాల ఆలోచన చేస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీ అవుతుంది. వ్యాపా రాల్లో లాభాల పంట పండుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితం చాలా వరకు హ్యాపీగా సాగిపోతుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడు తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలు నిలకడగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం ప్రయత్నాల మీద మరింతగా దృష్టి పెట్టడం మంచిది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయ త్నంతో చేతికి అందుతుంది. ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి.  పిల్లల విద్యా విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు  కొనుగోలు చేస్తారు. దగ్గర బంధువులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కొత్త ప్రయత్నాలు, నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం కలుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో పని భారం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోవడం గానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం, ఖర్చులు దాదాపు సరిసమానంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం కొద్దిగా వృద్ది చెందుతుంది. రావలసిన డబ్బును, బాకీలు, బకాయిలను వసూలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి. ముఖ్య వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సాఫీగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగు తుంది. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను మరింత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మితిమీరిన ఔదార్యం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు బాగా నిదానంగా ముందుకు సాగుతాయి. ఆదా యాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Exit mobile version