Site icon Desha Disha

Naresh: న‌గ‌రం న‌డిబొడ్డున ఇంధ్రభవనాన్ని తలపించేలా న‌రేష్ కొత్త ఇల్లు.. ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా? – Telugu News | Actor Naresh Pavithra New Luxury House Video Go Viral

Naresh: న‌గ‌రం న‌డిబొడ్డున ఇంధ్రభవనాన్ని తలపించేలా న‌రేష్ కొత్త ఇల్లు.. ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా? – Telugu News | Actor Naresh Pavithra New Luxury House Video Go Viral

దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నరేష్. హీరోగా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత సహాయక నటుడిగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంలోనూ వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు నరేష్. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకుని విడాకులిచ్చిన ఆయన ఇప్పుడు నటి పవిత్రా లోకేష్ తో సహ జీవనం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు నరేష్. అదేంటంటే.. హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున ఏకంగా ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారు నరేష్. ఇటీవలే పవిత్రా లోకేష్ తో కలిసి గృహ ప్రవేశం వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటులు మురళీమోహన్, అలీతో పాటు పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులందరినీ సాదరంగా ఆహ్వానించిన నరేష్-లోకేశ్ తమ విశాలమైన ఇంటిని చూపించారు. ఈ ఇంటికి ఎంట్ర‌న్స్ మొద‌లు, మాస్ట‌ర్ బెడ్ రూమ్ లు, కిచెన్, జిమ్ స్పేస్, వ‌రండాలు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్ ఇలా నరేష్ ఇల్లు ఇంద్ర భవనంలా కనిపించింది. ఇక ఈ ఇంట్లో త‌న అభిరుచి మేర‌కు ఒక వ‌ర‌ల్డ్ మ్యాప్ ని కూడా అత‌డు వ‌రండాలో ఏర్పాటు చేసుకున్నారీ సీనియర్ నటుడు.

సినీ ప్రముఖులందరికీ నరేష్ తన ఇంటిని చూపిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్ల నరేశ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఈ ఇంటికి అయిన ఖర్చుపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా లెక్కలేసుకుంటున్నారు. అయితే నరేష్ ఇంటి విలువ కోట్ల‌లోనే ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నరేష ఇంటి గృహ ప్రవేశం వేడుకలో సినీ ప్రముఖులు.. వీడియో..

ఆస్తులు 400 కోట్లకు పైమాటే..

కాగా నటుడు నరేష్ ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. గచ్చిబౌలి సమీపంలోని విప్రో సర్కిల్ వద్ద విజయనిర్మలకి సంబంధించి న ఐదు ఎకరాల ఫామ్ హౌస్ విలువ ఏకంగా రూ. 300 కోట్లు అని సమాచారం. అలాగే మొయినాబాద్, శంకరపల్లి పరిసరాల్లో మరో 30 ఎకరాల ఫామ్ ల్యాండ్స్‌ ఉండగా, వాటి విలువ కూడా రూ. 100 కోట్లకు పైగా ఉంటుంది. ఇవన్నీ నరేష్ పేరు మీదనే ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version