Site icon Desha Disha

Bigg Boss 9 Telugu : అగ్ని పరీక్ష’షో అనేదే ఒక పెద్ద భూటకమా..? వీళ్ళేమి జడ్జీలు బాబోయ్!

Bigg Boss 9 Telugu : అగ్ని పరీక్ష’షో అనేదే ఒక పెద్ద భూటకమా..? వీళ్ళేమి జడ్జీలు బాబోయ్!

Bigg Boss 9 Telugu : సామాన్యులను బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) లోకి పంపే ప్రక్రియ కోసం ‘అగ్నిపరీక్ష'(Agnipariksha) అనే స్పెషల్ ప్రోగ్రాం ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22 నుండి ఈ షో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అసలైన అగ్ని పరీక్ష షో మొదలు అయ్యే ముందు, వివిధ లెవెల్స్ ని దాటుకొని వచ్చిన 45 మంది సామాన్యులకు ఆడిషన్స్ ని నిర్వహించారు. మొదటి మూడు ఎపిసోడ్స్ ఈ ఆడిషన్స్ కి సంబంధించి ఉన్నింది. ఈ మూడు ఎపిసోడ్ ద్వారా ఆరు మంది సామాన్యులను నేరుగా టాప్ 15 లోకి పంపగా, 16 మందిని హోల్డ్ లో పెట్టారు. వీళ్లకు వివిధ రకాల టాస్కులు నిర్వహించి మరో 9 మందిని టాప్ 15 లోకి పంపుతారు. వాటికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఈరోజు నుండి అవి ప్రసారం అవ్వనున్నాయి.

అయితే ఈ ప్రక్రియ చాలా మంచిదే, కానీ న్యాయంగా జడ్జీలు వవహరించలేదని చాలా మందికి అనిపించింది. ముఖ్యంగా నిన్న అర్హత లేని వాళ్లకు తదుపరి రౌండ్స్ కి వెళ్లే అవకాశం ఇచ్చారు. కానీ అర్హత ఉన్న వాళ్ళని మాత్రం హోల్డ్ లో పెట్టారు, ఇది ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఉదాహరణకు నిన్న ఎపిసోడ్ ప్రారంభం లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చాడు. ఇతను ఇండియన్ ఆర్మీ లో పని చేస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన అనేక సంఘటనల కారణం గా ఆర్మీ లో పనిచేసేవారంటే జనాలు దేవుడి లెక్క చూస్తున్నారు, వాళ్ళపై సానుభూతి కూడా విపరీతంగా ఏర్పడుతుంది. కానీ ఇతను తన పై సానుభూతి కలిగించుకోవడానికి ఎలాంటి పనులు చేయలేదు. చాలా నిజాయితీ తో ఉన్నాడు. తనకు సినిమాల్లోకి వెళ్లడమంటే చిన్నప్పటి నుండి ఇష్టమని, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇండియన్ ఆర్మీ లోకి వెళ్లానని, ఒకవేళ బిగ్ బాస్ లో మంచి ఫేమ్ వచ్చి సినిమాల్లో అవకాశాలు వస్తే ఇండియన్ ఆర్మీ కి రాజీనామా చేస్తానని, ఒకవేళ మొదటి వారం లోనే ఎలిమినేట్ అయితే మళ్ళీ ఆర్మీ లోకి వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు.

అతని మాటల్లో ఎక్కడా డ్రామా కనిపించలేదు, చాలా క్యూట్ గా, ఫన్నీ గా మాట్లాడాడు, ఫిజికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అలాంటి వాడిని నేరుగా టాప్ 15 లోకి పంపుతారని ఆడియన్స్ ఆశించారు. కానీ అభిజిత్ మాత్రం రెడ్ కార్డు ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. ఇది అసలు నచ్చలేదు. మొదటి ఎపిసోడ్ నుండి ఈ అగ్నిపరీక్ష జడ్జీలలో చాలా బెటర్ గా అనిపించింది నవదీప్. కానీ నిన్న ఆయన కూడా చాలా అన్యాయమైన నిర్ణయం తీసుకున్నాడు. అసలు బిగ్ బాస్ కి ఏ యాంగిల్ లో కూడా పనికిరాని ఒక వ్యక్తిని హోల్డ్ లో పెట్టాడు, అద్భుతంగా మెప్పించిన వాళ్ళ లిస్ట్ లో ఇతన్ని పెట్టడం ఎంత వరకు కరెక్ట్? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. అదే విధంగా మొన్నటి ఎపిసోడ్ లో 19 ఏళ్ళ వయస్సు గల ఒక నెల్లూరు అమ్మాయి ని నేరుగా టాప్ 15 లోకి పంపారు, నిన్న అదే వయస్సు ఉన్న ఒక అబ్బాయి , అన్ని కోణాల్లోనూ తానూ బెస్ట్ అని నిరూపించుకుంటే అతన్ని మాత్రం పంపేశారు. చూస్తుంటే అగ్నిపరీక్ష కూడా రికమండేషన్స్ తోనే నడుస్తున్నట్టు అనిపించింది.

Exit mobile version