Site icon Desha Disha

awaited movie Mirai most

awaited movie Mirai most

– Advertisement –

హనుమాన్ సంచలన విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సూపర్ హీరో తేజ సజ్జా ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మిరాయ్’ (Mirai)’ లో సూపర్ యోధగా అలరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న మిరాయ్ ఈ సంవత్సరం బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌లలో ఒకటిగా మారనుంది. తేజ సజ్జ బర్త్‌డే సందర్భంగా మూవీ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో తేజ సూపర్ యోధ అవతార్‌ని అదిరిపోయేలా చూపించారు. కూలిపోతున్న వంతెన మీద చేతిలో కేవలం ఒక కర్రతో నిలబడి పోరాడుతున్న తేజ లుక్ అదిరిపోయింది.  ఆ పోస్టర్ ఆయన పాత్రలో ఉన్న పట్టుదల, ధైర్యం, మిరాయిలో ఉన్న హై వోల్టేజ్ డ్రామాని చూపించింది. మిరాయ్ టీజర్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ హిట్ అయ్యింది.

ఫస్ట్ సాంగ్ వైబ్ ఉంది చార్ట్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో రీతికా నాయక్ హీరోయిన్‌గా, మంచు మనోజ్ విలన్‌గా, శ్రీయా శరన్, జయరాం, జగపతి బాబు కీలక పాత్రల్లో (Jagapathi Babu roles) కనిపించనున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్‌కి దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మిరాయ్ 2డి, 3డి ఫార్మాట్‌లలో ఎనిమిది భాషల్లో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రెండవ చిత్రం.. హీరో తేజ సజ్జా తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇది మిరాయ్ తరువాత తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో సెకండ్ మూవీ అవుతుంది. నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో, టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ అదిరిపోయింది. ఈ పాన్ ఇండియా మూవీని సంక్రాంతి 2027కి గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

– Advertisement –

Exit mobile version