Site icon Desha Disha

బిగ్ బాస్ లోకి ఆర్మీ పవన్ కళ్యాణ్.. ఏదో జరిగేటట్టే ఉందే?

బిగ్ బాస్ లోకి ఆర్మీ పవన్ కళ్యాణ్.. ఏదో జరిగేటట్టే ఉందే?

Bigg Boss Telugu 9

Bigg Boss Telugu 9: టెలివిజన్ రంగంలో పెను సంచలనాలను సృష్టిస్తూ ముందుకు దూసుకెళుతున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్…ఇప్పటివరకు ఈ షోలో చాలామంది కంటెస్టెంట్లు పాల్గొని సెలబ్రిటీలుగా మారారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట కూడా చాలామంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ షో మీద గత కొన్ని సంవత్సరాల నుంచి నెగెటివిటీ పెరుగుతూ ఉండడం సామాన్య మానవులకు దీని ద్వారా యూస్ ఏం ఉండటం లేదు అంటూ కొన్ని కామెంట్లైతే వస్తున్నాయి. ఇక దీనిని పర్సనల్ గా తీసుకున్న బిగ్ బాస్ యాజమాన్యం సామాన్యులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నాం అంటూ అగ్నిపరీక్ష పేరుతో వాళ్లకి కొన్ని టాస్కులను పెడుతుంది. అందులో సక్సెస్ సాధించిన వాళ్లను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అగ్ని పరీక్ష షో స్టార్ మా టెలికాస్ట్ అవుతోంది. ఇక ఇప్పటికే మూడు ఎపిసోడ్లు టెలికాస్ట్ చేశారు. మరి ఈ అగ్నిపరీక్ష షోలో పాల్గొంటున్న 45 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది… అగ్ని పరీక్షలో కంటెస్టెంట్ గా వచ్చిన ఆర్మీ పవన్ కళ్యాణ్ అనే అబ్బాయి ఆర్మీ ఆఫీసర్ గా డ్యూటీ చేస్తూనే తనకు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల బిగ్ బాస్ షో లో పాల్గొనాలని వచ్చానని తెలియజేశాడు.

Also Read: ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకు.. చివరకు 13 ఏళ్ల బాలికను కూడా వదలలేదు!

ఇక దాంతో పాటుగా ఆయనకి ఆర్మీ నుంచి కూడా లీవ్ దొరికిందని ఒకవేళ బిగ్ బాస్ లో తను విజేతగా మారితే ఆర్మీ జాబ్ కి రిజైన్ చేస్తానని కూడా చెప్పాడు. మరి ఆర్మీ అబ్బాయి బిగ్ బాస్ హౌస్ లో ఉండడం వల్ల ఆయన దేశభక్తిని ఎలివేట్ చేస్తూ కొన్ని టాస్కులు అయితే చేసే అవకాశాలు ఉంటాయి.

దానివల్ల బిగ్ బాస్ షో మీద కూడా కొంతవరకు పాజిటివిటి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని సెలెక్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…అలాగే ఆయన ఫిజికల్ గా కూడా చాలా ఫిట్ గా ఉన్నాడు. ఎలాంటి టాస్క్ ను అయిన సరే ఈజీగా చేయగలుగుతాడు.

కాబట్టి అతన్ని అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే బాగానే ఉంటుంది అంటూ మరి కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అతని వల్ల బిగ్ బాస్ హౌస్ కి కూడా కొంతవరకు దేశభక్తిని పెంపొందిస్తూ జనాల్లో పాజిటివ్ నింపే ప్రయత్నం కూడా చేయొచ్చు. కాబట్టి అతనికి బిగ్ బాస్ హౌస్ లో ప్లేస్ కల్పించే అవకాశాలైతే ఉన్నాయి…

[

Exit mobile version