Site icon Desha Disha

డి.ఎస్సి.ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ర్యాంకర్ వైష్ణవి 

డి.ఎస్సి.ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ర్యాంకర్ వైష్ణవి 

విశాలాంధ్ర – తాళ్లపూడి : ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డి.ఎస్.సి ఫలితాల్లో తాళ్లపూడి కి చెందిన కొలచన వైష్ణవీ హారిక అనే యువతి ఉమ్మడి ప.గో జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (హిందీ విభాగం) గా ఏమొయిక అయ్యింది.  83.5 మార్కులతో జిల్లా లోనే మొదటి  ర్యాంక్ ను సాధించింది. మరియు ఎస్.జి టి  విభాగంలో 87 మార్కులతో జిల్లా లో 44వ ర్యాంక్ సాధించింది. కాగా ఈమె తండ్రి ప్రసాద్ మాస్టారు తాళ్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాథ్స్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. కుమార్తె  వైష్ణవి విజయం పట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యా యులు, ఉపాధ్యాయ సంఘాలు అభినందనలు తెలియజేసారు.

Exit mobile version