
దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో జియో (Jio) దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కస్టమర్లు ఎక్కువ శాతం జియో వినియోగిస్తున్న నేపథ్యంలో.. ఆ కంపెనీ ధరలను కూడా అమాంతం పెంచేస్తోంది. తాజాగా దిగువ స్థాయి రీఛార్జ్ ను కూడా జియో ఎత్తేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్ తో ముందుకు వచ్చింది. కేవలం 147 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజులపాటు వ్యాలిడిటీ వచ్చేలా… ఓ ఆఫర్ ప్రకటన చేసింది.
సామాన్యులకు ఎప్పుడు అందుబాటులో ఉండేలా.. ప్లాన్స్ రూపొందించే బిఎస్ఎన్ఎల్ ( BSNL).. 30 రోజుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. 147 రూపాయలతో రీఛార్జ్ చేస్తే… 30 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే రోజుకు ఐదు రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తోంది కంపెనీ. ఈ 30 రోజుల పాటు ఉచితంగా అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. 10 జిబి డేటా మాత్రమే అందిస్తున్నారు. అయితే 10 జిబి డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్ కు తగ్గిపోతుంది. అంటే నెట్ చాలా స్లో అయిపోతుంది. వేగంగా ఇంటర్నెట్ వాడుకునే వాళ్లకు ఈ ప్యాకేజీ సెట్ కాదు కానీ… మిగతా వాళ్ళు శుభ్రంగా వాడుకోవచ్చు.