Site icon Desha Disha

ఈ రాశి వారు ఈరోజు ఎవరికైనా డబ్బు ఇస్తున్నారా?

ఈ రాశి వారు  ఈరోజు ఎవరికైనా డబ్బు ఇస్తున్నారా?

ఈ రాశి వారు  ఈరోజు ఎవరికైనా డబ్బు ఇస్తున్నారా?

Today Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకున్న ఫలితాలు ఉండలు ఉన్నాయి. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తూ ఉంటాయి. వారు గతంలో చేపట్టిన పనులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. అయితే వీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. దీంతో సంతృప్తి చెందుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారులకు దరలాపం ఉండనుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు అంటే దూర ప్రయాణాలు చేస్తారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ విషయంలో ఉద్యోగులు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగుంటుంది. అర్హులైన వారికి పెళ్లి ప్రయత్నాలు ఉంటాయి. ఆస్తి వివరాలకు సంబంధించి వివాదాలు సమసిపోతాయి. ఆలయం గురించి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. దీంతో వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే లాభం చేపడుతుంది. ఎవరైనా ఇబ్బంది పెడితే వారికి దూరంగా ఉండటమే మంచిది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . వ్యాపారాల్లో సానికూర లాభాలు ఉంటాయి. ఆరోగ్యం గతంలో కంటే బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అయితే అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సంయమనం పాటించాలి. కొన్ని ప్రాజెక్ట్ లు పూర్తి చేయడానికి తోటి వారి సహాయం తీసుకుంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వివాహం చేసుకోవాలని అనుకునే వారికి శుభవార్తలు అందుతాయి. ఆదాయం పెరగడంతో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీంతో కొన్ని పనులు పూర్తి కావడానికి ఈజీ అవుతుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. డబ్బు సహాయం కావాలంటే ఇతరులు ముందుకు వస్తారు. ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురైతే జాగ్రత్తగా ఉండాలి. సోదరుల మధ్య విభేదాలు తలెత్తి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. గతంలో చేపట్టిన పనులు ఈరోజు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగులు అదరపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతంగా ఉంటాయి. వ్యాపారుల ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అయితే వీరికి తోటి వారి సహాయం ఉంటుంది. బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) :  వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారు. డబ్బు విషయంలో ఇతరులను నమ్మకుండా ఉండాలి. ఎవరైనా డబ్బు ఇస్తే ఆలోచించాలి. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పడతాయి. అయితే జీవిత భాగస్వామి సలహాతో వీటి నుంచి బయటపడతారు. కొందరు బంధువులు ధన సహాయం చేస్తారు. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసే వారికి శుభవార్తలు అలుతాయి. డబ్బు విషయంలో ఇతరులకు వాగ్దానాలు చేయకూడదు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు అనుకున్నా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు సమస్యలు వెంటాడుతాయి. విద్యార్థుల ఇష్టంతో కొన్ని పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

[

Exit mobile version