ఆసియా కప్‌కు అఫ్ఘనిస్థాన్ జట్టు ప్రకటన

ఆసియా కప్‌కు అఫ్ఘనిస్థాన్ జట్టు ప్రకటన

కాబుల్: మరో రెండు వారాల్లో ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు. స్పిన్ బౌలర్ల ఆధిపత్యం ఉన్న ఈ జట్టులో రషీద్‌తో పాటు నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఎఎం ఘజన్ఫర్ లతోపాటు ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ కూడా జట్టులో ఉన్నారు. గతేడాది జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ సెమీఫైనల్ వరకు చేరి చరిత్ర సృష్టించింది. ఇక ఇటీవల జింబాబ్వే సిరీస్‌లో ఆడిన జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. హజ్రతుల్లా జజై, జుబైద్ అకబరీలను జట్టు నుంచి తప్పించి.. రహమానుల్లా గుర్బాజ్, మహమ్మద్ ఇషాక్ ఇద్దరూ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా జట్టులోకి తీసుకున్నారు.

జట్టులో పేస్ బౌలిం గ్ కోసం నవీన్- ఉల్ -హక్, ఫజల్ హక్ ఫరూకీ, ఫరీద్ మాలిక్‌లను ఎంపిక చేశా రు. బ్యాటింగ్ విభాగంలో ఇబ్రాహీం జా ద్రాన్, దర్వీష్ రసూలీ, సెడికుల్లా అతా ల్, అజ్మతుల్లా ఒమర్జై, కరీమ్ జనత్, గు ల్బదిన్ నయిబ్, షరఫుద్దీన్ అష్రఫ్ ఉన్నా రు. కాగా, ఆసియా కప్‌లో గ్రూప్‌బిలో ఉన్న అఫ్ఘనిస్థాన్ జట్టు.. బంగ్లాదేశ్, హాం కాంగ్, శ్రీలంకలతో కలిసి తలపడనుంది. రషీద్ సేన తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 9న హాంకాంగ్‌తో ఆడనుంది.

Leave a Comment