Site icon Desha Disha

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..12 రాశుల వారికి రాశిఫలాలు – Telugu News | Horoscope Today August 23, 2025: Astrological prediction for all zodiac signs in Telugu

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం..12 రాశుల వారికి రాశిఫలాలు – Telugu News | Horoscope Today August 23, 2025: Astrological prediction for all zodiac signs in Telugu

దిన ఫలాలు (ఆగస్టు 23, 2025): మేష రాశికి చెందిన ఉద్యోగులకు పని ఒత్తిడి బాగా తగ్గే అవకాశముంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన ఉద్యోగుల జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని బాగా లాభపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త వస్తు వాహన లాభాలు పొందుతారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిపిస్తాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబపరంగా అదనపు బాధ్యతలు మీద పడతాయి. పిల్లలకు సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యక్తిగతంగా ఒకటి రెండు చిన్నచిన్న సమస్యలు తలెత్తే సూచనలున్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉంటాయి. ఆదాయం కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. బంధు మిత్రులకు సహాయంగా నిలబడతారు. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తొందర పాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చర్యలు చేపట్టడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారులు కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. అనుకున్న వ్యవహారాలు, పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో శుభ కార్యాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబం జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగుల సమర్థతకు, శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు చాలావరకు ఒక కొలిక్కి వస్తాయి. వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల మీదా, సొంత పనుల మీదా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశంఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. శక్తికి మించి ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు కలుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇంతవరకూ వసూలు కాని బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారులతో కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన బాధ్యతలను, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. స్నేహితుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

Exit mobile version