Site icon Desha Disha

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. ‘మెగా-157’ సినిమా టైటిల్ గ్లింప్స్

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. ‘మెగా-157’ సినిమా టైటిల్ గ్లింప్స్

– Advertisement –

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నేడు చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్‌ను రిలీజ్ చేస్తూ మేకర్స్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బర్త్ డే ట్రీట్ రానేవచ్చింది. తాజాగా, ‘మెగా-157’ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ టైటిల్ పెట్టగా.. పండగకి వస్తున్నారు అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్నట్లు తెలుపుతూ గ్లింప్స్ షేర్ చేశారు. ఇక ఇందులో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. సూట్, బూటు ధరించి చుట్టూ గాగుల్స్ పెట్టుకుని స్టైల్‌గా సిగరెట్ వెలిగిస్తూ ఫుల్ సెక్యూరిటీతో ఎంట్రీ ఇచ్చారు.

Mana ShankaraVaraprasad Garu Title Glimpse | Megastar Chiranjeevi | Nayanthara | Anil Ravipudi

కాగా ఈ సినిమా అనిల్ రావిపూడి-మెగాస్టార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్, హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

– Advertisement –

Exit mobile version