దిన ఫలాలు (ఆగస్టు 21, 2025): మేష రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. వృషభ రాశి వారి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల విషయంలో సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. విందులు, వినోదాలు, విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. లాభాలు, రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇవ్వవద్దు. వృథా ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధార పడడం మంచిది. ఆరోగ్యం అను కూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు వెడతాయి. ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉన్నా ఆశించిన ప్రతి ఫలం అందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం పెట్టుకోవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒకరిద్దరు బంధు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తిసామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలు ఆశించిన విధంగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఒకటి రెండు శుభ ఫలితాలు, శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం వృద్ధి చెందుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులకు, ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రతి ఆదాయ ప్రయత్నం అనుకూలిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి, కొత్త ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు అనుకోకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయ ప్రయత్నాల వల్ల లాభం ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఊహించని ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు ఢోకా ఉండదు. అనుకోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు. మిత్రుల సాయంతో ముఖ్య మైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఏ రంగానికి చెందినవారైనా విజయాలు, సాఫల్యాలతో పురోగతి చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను, బాధ్యతలను సవ్యంగా, సకాలంలో పూర్తి చేస్తారు. అదనపు ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. చిన్న ప్రయత్నంతో మంచి ప్రయోజనాల్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ది చెందుతాయి. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా కొంత వరకు సఫలమవుతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నించేందుకు ఇది మంచి సమయం. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది శ్రమతో పరిష్కారం అవుతుంది.