Khalistan Republic Embassy: కెనడా ఓ విచిత్రమైన దేశంగా అనిపిస్తోంది. ట్రంప్ విధానాలతో అమెరికాతో సమస్యలు తెచ్చుకుంటోంది. ఇక భారత్ వ్యతిరేక శక్తులను పెంచి పోషిస్తోంది. కెనడాలోని పశ్చిమ తీరంలోని సర్వే పట్టణంలో ఇందులో ఇండియన్స్ ఎక్కువ.. పంజాబీలు, హిందువులు ఎక్కువగా ఉంటారు. పశ్చిమ తీరంలోని సియాటిల్ నగరంలో భారతీయులు ఎక్కువ ఉంటారు. సర్వేలో భారతీయ షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ భారతీయులు ఎక్కువగా షాపింగ్ చేస్తారు.
అయితే సర్వేలో ఖలిస్థానీ జెండాలతో భారత వ్యతిరేకులు బహిరంగంగా తిరుగుతూ భారత్ పై విషం చిమ్ముతున్నారు. గురునానక్ గురుద్వారాలో అదే ప్రాంగణంలో కమ్యూనిటీ సెంటర్ ను ప్రభుత్వం కట్టించింది. దానికి ఎలివేటర్ కూడా లక్షన్నర డాలర్లతో ప్రభుత్వం పెట్టించింది.
ఆ బిల్డింగ్ కు ‘రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్థాన్’ అని పెట్టి ఆ బిల్డింగ్ ను వాళ్ల రాయబార కార్యాలయంగా మార్చారు. సర్వేలో కెనడా ప్రభుత్వం ఉండగా.. ఇలాంటి చేష్టలు చేస్తుంటే ఎలా అర్థం చేసుకోవచ్చు.
ఖలిస్థానీలు ఈ పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాయని కెనడా ఇంటెలిజెన్స్ పేర్కొన్న కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఖలిస్థానీల వెనుక ఐఎస్ఐ ఉంది. పాకిస్తాన్ ఇదంతా భారత్ కు వ్యతిరేకంగా మారింది.
కెనడాలో ఖలిస్తాన్ రిపబ్లిక్ రాయబార కార్యాలయమాట? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
[