Senior Heroine Sangeetha Divorce: సినీ సెలబ్రిటీలకు పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం అనేది ఈమధ్య కాలం లో సర్వసాధారణం అయిపోయింది. మనల్ని కొన్ని లక్షల మంది అభిమానులు అనుసరిస్తూ ఉంటారు, వాళ్లకు మనం ఇలా చేయడం ద్వారా ఎలాంటి సంకేతం అందిస్తున్నాము అనేది కూడా ఆలోచించరు. పెళ్ళైన కొత్త జంటలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో విఫలమై విడాకులు తీసుకున్నారంటే అందులో ఒక అర్థం ఉంది. కానీ వివాహం జరిగి, ఏళ్ళ తరబడి దాంపత్య జీవితం కొనసాగిస్తూ, సంతానం కలిగిన సినీ సెలబ్రిటీలు కూడా విడాకులు తీసుకోవడం ఈమధ్య కాలం లో ఎక్కువ అయిపోయింది. ధనుష్, ఐశ్వర్య జంటలతో పాటు, జయం రవి – ఆర్తి ఇలా ఎన్నో విడిపోయిన జంటలు ఉన్నాయి. ఇప్పుడు వీరి జాబితాలోకి సీనియర్ హీరోయిన్ సంగీత(Sangeetha) కూడా చేరిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం.
Also Read: న్యాయ పోరాటానికి సిద్దమైన ధనుష్ దర్శకుడు..వివాదం తారాస్థాయికి చేరిందిగా!
సంగీత ప్రముఖ గాయకుడు, నటుడు అయిన క్రిష్ ని 2009 వ సంవత్సరం లో ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. ఆమె కూడా ఇప్పుడు పెద్దది అయ్యింది. 16 ఏళ్ళ నుండి వీళ్లిద్దరి దాంపత్య జీవితం సాఫీగానే కొనసాగింది. కానీ ఈమధ్య కాలంలో ఏర్పడిన కొన్ని సంఘటనల కారణంగా వీళ్లిద్దరి మధ్య విబేధాలు చెలరేగాయని, ఆ కారణం చేత వీళ్ళు విడిపోబోతున్నారని సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ఒక టాక్ నడుస్తుంది. అయితే ఈమధ్య కాలం లో ఇలాంటి రూమర్స్ రావడం సర్వ సాధారణం అయిపోయింది, ఇది కూడా కేవలం రూమర్ మాత్రమే అయ్యుండొచ్చని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా సంగీత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పేరు ని మార్చుకోవడం తో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇంతకు ముందు సంగీత పేరు సంగీత క్రిష్ అని ఉండేది.
కానీ ఇప్పుడు కేవలం సంగీత అని మాత్రమే ఉంది. దీంతో నెటిజెన్స్ వీళ్లిద్దరు నిజమ్గానే విడిపోయారని అనుకుంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. చాలా మంది సినీ సెలబ్రిటీలు, విడాకులకు ముందు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటారు. పేరు మార్చేయడం, లేకపోతే పెళ్ళికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ నుండి తొలగించడం వంటివి చేస్తుంటారు. సంగీత కూడా అలా చేయడం తో ఈ అనుమానాలకు తెరదీసింది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది అధికారికంగా వారిద్దరిలో ఒకరు రెస్పాన్స్ ఇస్తే తప్ప ఎవరికీ తెలియదు , అప్పటి వరకు ఈ జంట అనధికారికంగా విడిపోయినట్టే అని మనం అనుకోవాలి. ఇక సంగీత సినిమాల విషయానికి వస్తే ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె, పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆమె రీ ఎంట్రీ ఇచ్చి క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది.
[