Site icon Desha Disha

త్వరలో భారత్ కు రానున్న పుతిన్

త్వరలో భారత్ కు రానున్న పుతిన్

– Advertisement –

నవతెలంగాణ – హైదరాబాద్: రష్యా నుంచి ముడిచమురు కొంటున్నారనే కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఏదో ఒక విధంగా భారత్ ను రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా చూడాలనే యోచనలో ట్రంప్ ఉన్నారు. అయితే, ఇవేవీ భారత్-రష్యా స్నేహ బంధంపై ప్రభావం చూపలేకపోయాయి. రష్యా అధినేత పుతిన్ త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు.

ఈ ఏడాది చివర్లో ఆయన భారత పర్యటన ఉండొచ్చని ‘ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీ’ తెలిపింది. భారత్ పై మరో 25 శాతం సుంకాలు పెంచుతూ నిన్ననే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. ఇది జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే భారత పర్యటకు పుతిన్ వస్తున్నారనే వార్త అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

– Advertisement –

Exit mobile version