Mahesh Babu After SSMB29: ‘ఎస్ఎస్ఎంబి 29’ తర్వాత మహేష్ ఆ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు..?

Mahesh Babu After SSMB29: ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఎవరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)… మనం కూడా పాన్ ఇండియా సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించొచ్చు అని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తెలియజేసిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఇక ఆయన అడుగుజాడల్లోనే మిగతా ఇండస్ట్రీలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ప్రపంచంలో ఉన్న సినీ ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక మహేష్ బాబు లాంటి నటుడు సైతం ఈ సినిమా కోసం చాలావరకు కష్టపడుతున్నాడు. మరి ఆయన తన కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఈ సినిమాతో 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అతను ఒక స్టార్ హీరో అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో మహేష్ బాబు ఉన్నాడు…ఇక యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి…ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Also Read: స్పిరిట్ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారో తెలుసా..?

అయితే ఈ సినిమా విషయం పక్కన పెడితే ఈ సినిమా తర్వాత ఆయన ఏ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వెలువడుతున్నాయి. మరి ఆయన చేయబోతున్న ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేదాన్ని బట్టి ఆయన తన తదుపరి సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయడానికి సందీప్ రెడ్డి వంగాతో పాటు ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు సైతం ఆసక్తి అయితే చూపిస్తున్నారట…మరి వీళ్ళలో ఎవరికి ఆ అదృష్టం దక్కుతోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వెంటనే ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారనుంది.

Also Read:  రాజమౌళి వల్లే సినిమా ఇండస్ట్రీ కి ఈ దారుణమైన పరిస్థితి ఏర్పడిందా..?

మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దానిమీద సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మహేష్ బాబు తన తదుపరి సినిమాతో బిజీ అయిపోబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన సినిమా యూనిట్ తొందరలోనే మూడోవ షెడ్యూల్ ని కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు…

Leave a Comment