AP MLA Viral Video: చాలామంది ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత వ్యవహార శైలిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో వారు అబాసుపాలు అవుతున్నారు. వ్యక్తిగత వ్యవహార శైలిలో ప్రత్యర్ధులు ట్రాప్ చేస్తుంటారని.. చాలా జాగ్రత్తగా మెలగాలని పార్టీ హై కమాండ్లు ఆదేశిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. అయితే దానికి సంబంధించిన ఎటువంటి సౌండ్ లేదు. సైగలు చేస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తూ మాత్రం కనిపించారు. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో( social media) వైరల్ అవుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని విపరీతంగా ట్రోల్ చేస్తోంది.
Also Read: విశాఖ రైల్వే జోన్.. కీలక పరిణామం!
వీడియోలో కనిపించని ఆడియో..
గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా మహమ్మద్ నసీర్ అహ్మద్( Mohammed Nasir Ahmed ) ఉన్నారు. ఆయనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎమ్మెల్యే తన నివాసంలో ఉండగా.. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వీడియోలో ఆడియో వినపడటం లేదు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. అసలు ఆ మహిళ ఎవరు? ఎమ్మెల్యే వీడియో కాల్ లో ఏం మాట్లాడారన్నది క్లారిటీ లేదు. ఆమె గతంలో టిడిపి కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వివాదంపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పందించాల్సి ఉంది.
Also Read: టార్గెట్ కొడాలి నాని.. విచారణ, ఆపై అరెస్ట్?!
ప్రజా జీవితంలో ఉన్నామన్న స్పృహ లేకుండా..
అయితే చాలామంది నేతలు ప్రజల మధ్య ఉంటున్నామన్న సంగతి మరిచిపోతున్నారు. ప్రైవేటు వ్యవహారాలను సైతం రచ్చ చేసుకుంటున్నారు. ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహార శైలి పై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే చాలామంది నేతల ప్రైవేటు వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. వారి రాజకీయ జీవితానికి మాయని మచ్చగా మారుతున్నాయి. అయినా ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు రావడం లేదు. ఇటువంటి విషయాల్లో పార్టీ హై కమాండ్లు కఠినంగా వ్యవహరించకుంటే మాత్రం మూల్యం తప్పదు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ప్రతి నేత నిఘా నీడలోకి వెళ్లిపోతారన్న నిజాన్ని గ్రహిస్తే మంచిది. లేకుంటే మాత్రం ప్రమాదకరమే.
చంద్రబాబు ”కామ” పార్టీ సిత్రాలు….!
టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు బట్టబయలు.
గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన మహిళకి వీడియో కాల్ చేసి అసభ్యకరంగా సైగలు చేస్తూ మాట్లాడిన గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
బాధితురాలు ట్రైన్లో… pic.twitter.com/S37FRfW6wW
— YSR Congress Party (@YSRCParty) August 4, 2025
[