శభాష్ సిరాజ్.. తండ్రి కష్టానికి గుర్తింపు తెచ్చావ్.. దేశాన్ని

Eng Vs Ind 5th Test Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్.. సోషల్ మీడియా మొత్తం ఇతడి నామస్మరణతో మారుమోగుతోంది. ప్రధాన మీడియా ఇతడి చుట్టూ తిరుగుతోంది. ఇక డిజిటల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతడు సృష్టించిన విధ్వంసం అటువంటిది. సాధించిన పరాక్రమం అటువంటిది. అసలు ఆశలు లేనిచోట.. ఇటువంటి నమ్మకం లేని చోట.. ఇతడు ఆశలు కల్పించాడు. నమ్మకాన్ని కలిగించాడు. తద్వారా అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు. గెలుస్తుందనుకున్న ప్రత్యర్థి జట్టును ఓడించి చూపించాడు. ఇంత జరిగినప్పటికీ అతడిలో కించిత్ అతి కూడా లేదు. సాధించాను అని గర్వం కూడా లేదు. ఇప్పటికీ అదే డౌన్ టు ఎర్త్ లాగే ఉన్నాడు.

Also Read: ఏ టీ20 వరల్డ్ కప్ ఇవ్వగలదు.. ఏ ఛాంపియన్స్ ట్రోఫీ అందించగలదు..ఏం విక్టరీ భయ్యా…

ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన చివరి టెస్టులో 6 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత మియా భాయ్ ఉద్వేగంగా మాట్లాడాడు. తన విజయాన్ని చూడలేని తండ్రిని గుర్తు చేసుకున్నాడు. తను ఈ స్థాయికి రావడానికి తండ్రి పడిన కష్టాన్ని నెమరు వేసుకున్నాడు. ఐదో టెస్టు చివరి రోజు ఉదయం లేవగానే జట్టును గెలిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు..బ్రూక్ క్యాచ్ సరిగా పట్టి ఉంటే మ్యాచ్ గెలిచేదని పదే పదే గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు రవీంద్ర జడేజా తనతో చెప్పిన మాటలను నెమరు వేసుకున్నాడు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ బౌలింగ్ చేశాడు. ఏకంగా మూడు వికెట్లను వెంటవెంటనే తన ఖాతాలో వేసుకొని టీమిండియా కు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. అన్ని ఓవర్లు వేసావు కదా.. ఇంకా అలసిపోలేదా.. అని ఓ రిపోర్టర్ అడిగితే.. దేశం కోసం ఆడుతుంటే మజా వస్తుంది.. ఇన్ని ఓవర్లు అని లెక్కలు వేసుకోలేము కదా.. అని అతడు చెప్పిన సమాధానం అద్భుతం అనన్య సామాన్యం.. జట్టు కోసం ఆడే వాళ్లకు ఇటువంటి మాటలే వస్తుంటాయి.

ఈ సిరీస్లో టీమిండియాలో చాలామంది ఆటగాళ్లు మారారు. ఇంగ్లాండ్ జట్టులోను అదే సన్నివేశం కనిపించింది. అయితే సిరాజ్ మాత్రం ఐదు టెస్టులూ ఆడాడు. కొన్ని ఓవర్లు మాత్రమే వేసి అతడు అలసిపోలేదు. ప్రతి సందర్భంలోనూ ప్రత్యర్థి బ్యాటర్లను కవ్వించాడు. వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జట్టుకు వికెట్ అవసరమైన ప్రతి సందర్భంలోనూ కెప్టెన్ గిల్ సిరాజ్ వైపు చూశాడు. సిరాజ్ ఈ సిరీస్లో 180 కి పైగా ఓవర్లు వేశాడు. మూడో టెస్టులో టీమిండియా ఓడిపోయినప్పుడు బాధపడిన అతడు.. ఐదవ టెస్టులో టీమిండియాని గెలిపించి అంతగా సంబరాలు చేసుకున్నాడు.ఈ సిరీస్లో మియా భాయ్ ఏకంగా 1,113 బంతులు వేశాడు. అతడికంగా 23 వికెట్లు పడగొట్టాడు.


[

Leave a Comment