'వార్ 2' ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..దద్దరిల్లిపోతున్న సోషల్ మీడియా ట్రోల్స్!

War 2 Overseas Advance Bookings

War 2 Overseas Advance Bookings: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్’ చిత్రం 2019 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలై సంచలన విజయం సాధించింది. ఆరోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 475 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ సూపర్ హిట్ అనేది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే ఎలాంటి క్రేజ్ ఉండాలి?, ఈపాటికి ఎక్కడ చూసినా ఆ సినిమా మేనియా నే కనిపించాలి. కానీ ఈ చిత్రం పై అటు బాలీవుడ్ లో కానీ, ఇటు టాలీవుడ్ లో కానీ కనీస స్థాయి హైప్ కూడా లేదు అనేది వాస్తవం.

Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..

అందుకు ఉదాహరణగా ఓవర్సీస్ లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని తీసుకోవచ్చు. నార్త్ అమెరికా లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి హిందీ + తెలుగు కలిపి 1600 షోస్ కి పైగా షెడ్యూల్ చేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం లక్షా 66 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చింది. ఎన్టీఆర్ గత చిత్రం దేవర నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోస్ నుండి దాదాపుగా మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంత పెద్ద ప్రీమియర్ రికార్డు పెట్టిన తర్వాత అభిమానులు ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా నుండి కనీస స్థాయి గ్రాస్ ని ఆశించడం సహజం. కానీ ఈ చిత్రం అడ్వాన్స్ గ్రాస్ అసలు కదలడం లేదు. మరోపక్క అదే రోజున విడుదల అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే 1 మిలియన్ డాలర్లు దాటేసింది.

కానీ ‘వార్ 2’ చిత్రానికి 1600 షోస్ షెడ్యూల్ చేసిన గ్రాస్ రావడం లేదు. నిన్న తెలుగు వెర్షన్ నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా పది వేల డాలర్లు వస్తే, హిందీ వెర్షన్ నుండి కేవలం ఆరు వేల డాలర్లు మాత్రమే వచ్చింది. దీంతో సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘హరి హర వీరమల్లు’, ‘గేమ్ చేంజర్’ సినిమాల నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ సమయం లో ఇదే రేంజ్ ట్రోల్స్ చేశారు. దానికి ప్రతీకారంగా ఈ ఇద్దరి హీరోల అభిమానులు పోటీ పడి మరీ ట్రోల్స్ వేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ని కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేక సందర్భాల్లో ట్రోల్స్ వేశారు, అందుకే ఈ సమయం లో వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ప్రతీకారం తీర్చుకుంటూ దారుణమైన ట్రోల్స్ వేస్తున్నారు.


[

Leave a Comment