పూరి – విజయ్ సేతుపతి మూవీ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో…

Puri Vijay Sethupathi Movie

Puri Vijay Sethupathi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh)…ఆయన చేసిన సినిమాలు అప్పట్లో గొప్ప విజయాలను సాధించాయి. ఇప్పుడున్న హీరోలు అందరినీ స్టార్ హీరోలుగా మార్చడంలో ఆయన కీలకపాత్ర వహించాడు. ఆయన సినిమాలో చేయకముందు ఆయన సినిమాలో చేసిన తర్వాత అనేంతల మన స్టార్ హీరోలు వాళ్ళ రేంజ్ ను మార్చుకున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ప్రస్తుతం ఆయన ఫ్లాపుల్లో ఉన్నప్పటికి విజయ్ సేతుపతి లాంటి నటుడితో ఒక డిఫరెంట్ సబ్జెక్టుతో సినిమాను చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన పూరి జగన్నాథ్ మొదట కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి ఆ తర్వాత సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలను చిత్రీకరించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట. అందుకోసమే విజయ్ సేతుపతి లుక్కుని కూడా మార్చేసినట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న పూరి జగన్నాథ్ ఈ సినిమాలో ఒక స్టార్ హీరోతో గెస్ట్ అప్పిరియన్స్ ఇప్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవిగా తెలుస్తోంది…మొదటి నుంచి చిరంజీవి అభిమాని అయిన పూరి జగన్నాథ్ అతనితో సినిమా చేయడానికి చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాడు.

Also Read: రాజమౌళి వల్లే సినిమా ఇండస్ట్రీ కి ఈ దారుణమైన పరిస్థితి ఏర్పడిందా..?

అయినప్పటికి అది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. కాబట్టి ఈ సినిమాలో అతని చేత ఒక చిన్న గెస్ట్ అప్పిరియన్స్ ఇప్పించి అతన్ని డైరెక్షన్ చేయాలనే ఉద్దేశ్యంతో పూరి జగన్నాధ్ ఉన్నాడట. చిరంజీవికి కూడా ఈ సినిమాలో తన ఒక పాత్ర గురించి వివరించి చెప్పారట.

ఇక ఆయన కూడా ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి విజయ్ సేతుపతి లాంటి నటుడు సినిమాలో చిరంజీవి నటించడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతోంది. సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందా?

Also Read: ‘ఎస్ఎస్ఎంబి 29’ తర్వాత మహేష్ ఆ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు..?

భారీ ఎలివేషన్స్ తో ఉంటుందా లేదంటే ఒక సింపుల్ క్యారెక్టర్ గా వచ్చి వెళ్లి పోతుందా అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో పూరి ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తాడు అనేది…ఈ సినిమా ఆడితేనే పూరి ఇండస్ట్రీ లో ఉంటాడు. లేకపోతే ఇక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సిన పరిస్థితే అయితే ఎదురవ్వచ్చు…

Leave a Comment