Husband And Wife Relationship: భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. ఇద్దరూ తెలియని వ్యక్తులు ఒకే ప్రయాణం చేస్తూ తమ జీవిత లక్ష్యాలను చేరుకుంటారు. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ఒకరి మనస్తత్వాలు మరొకరికి అర్థం కాకుండా.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి చేసే ప్రయత్నంలో ఇద్దరి మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. అయితే ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అన్నా విషయాన్ని ఇద్దరు అనుకోవాలి అని మానసిక నిపుణులు అంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో భార్యలపై భర్తలు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంతవరకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆ తర్వాత వారు తిరగబడితే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఈ క్రమంలో భర్తతో కలిసి ఉండడానికి భార్య ఇష్టంగా ఉండదు. ముఖ్యంగా ఈ లక్షణాలను పురుషులు కలిగి ఉంటే భార్యతో కలిసి ఉండలేరు. మరి ఆ లక్షణాలు ఏవో చూద్దాం.
Also Read: ఏపీ అభివృద్ధికి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్!
సేవ:
కొందరు పురుషులు తాము ఫీల్డ్ వర్క్ చేసి వస్తామని.. ఇంట్లో తమకు సేవ చేయాలంటూ బానిసలా చూస్తూ ఉంటారు. కానీ అలా చూడకుండా కేవలం సహాయకారిగా మాత్రమే చూడాలి. అంటే కొన్ని విషయాల్లో పురుషులు భార్యలను సహకారం అడగవచ్చు. కానీ తనకు కచ్చితంగా సహాయం చేయాలంటూ ఆర్డర్ వేయరాదు. అలా ప్రతిసారి వేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఓపిక నశించిన భార్యలు సేవ చేయడానికి ఏమాత్రం ఒప్పుకోరు. ఫలితంగా వారికి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు..
నిశ్శబ్దం:
ఒక్కో సందర్భంలో భార్య మౌనంగా ఉంటుంది. కానీ తనకు ఎలాంటి ఆలోచనలు లేవని అనుకోవద్దు. ఎందుకంటే ఒక వివాహిత ఎలాంటి మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉంటుందంటే తాను ఏదో విషయంలో విసిగిపోయిందని అర్థం. అంటే భర్త తన మాట వినకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి ఎదుర్కోవచ్చు. అందువల్ల మౌనంగా ఉండే భార్యను కారణం ఏంటో తెలుసుకోవాలి. ఆ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్దదిగా మారి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ తన మాట వినకపోవడమే కారణం అయితే.. తనకు అనుగుణంగా ఉండడమే మంచిది.
గౌరవం-గర్వం:
మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలని పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం భార్యాభర్తల్లో కూడా ఉంటుంది. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటేనే ఇంట్లో స్వచ్ఛమైన వాతావరణ ఉంటుంది. అలా కాకుండా గర్వం ప్రదర్శిస్తే తిరగబడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారిపై పురుషులు గర్వంగా ఉంటే ప్రతి పనిలోనూ వ్యతిరేకంగా ఉండగలుగుతారు..
గుర్తింపు:
పురుషులు ఫీల్డ్ వర్క్ చేస్తే మహిళలు ఇంట్లో ఎన్నో పనులు చేస్తుంటారు. కానీ కొందరు పురుషులు తమకంటే మహిళలు ఎలాంటి పనులు చేయడం లేదనే భావనతో ఉంటారు. అంతే ఇంట్లో భార్యపై కూడా ఇలాంటి వాదనలే చేస్తూ తామే గొప్పవారు అంటూ.. తమకు మాత్రమే గుర్తింపు ఉందని భావిస్తారు. ఈ విషయం వల్ల ఇద్దరి మధ్య గొడవ ఏర్పడి దూరం పెరిగి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భార్య చేసే పనికి కూడా గుర్తింపు ఉంటుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.
బాధ్యత:
ప్రతి విషయంలోనూ.. ప్రతి తప్పుకు భార్యని కారణం అంటూ నిందించడం సరికాదు. ఇలా చేయడం వల్ల భర్త పై అసహనం కలుగుతుంది. అంతేకాకుండా తన బాధ్యత కూడా భార్యదే అని అనుకోవడం సరికాదు.
[