‘కూలీ’ లో ఎవ్వరూ ఊహించని సప్రైజ్ ఎలిమెంట్స్..- OkTelugu

Coolie Movie Unexpected Twists: సూపర్ స్టార్ రజనీకాంత్(Super star Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం తమిళ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూసారో, తెలుగు ఆడియన్స్ కూడా అంతలా ఎదురు చూస్తున్నారు. యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న లోకేష్ కనకరాజ్ లాంటి స్టార్ డైరెక్టర్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది మరీ. దానికి తోడు ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ స్టార్స్ అందరూ ఇందులో ఉన్నారు. అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, సత్య రాజ్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పోతూనే ఉంటుంది. అయితే ఇంత మంది స్టార్స్ ని పెట్టుకొని కూడా, ఎందుకు ట్రైలర్ ని అంత చప్పగా కట్ చేశారు అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు.

Also Read:  కూలీ సినిమాలో ప్రభాస్… ఊహించని ట్విస్ట్

సినిమాలో చాలా అంశాలను డౌన్ చేస్తూ, విపరీతమైన అంచనాలను తగ్గించడానికి అన్నట్టుగా రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కట్ ఉన్నది. అయితే ఈ ట్రైలర్ ని చూసి విశ్లేషకులు ఎన్నో కోణాల్లో తమకు తోచిన విధంగా విశ్లేషించారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన సినిమా అని, టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిందని, మీరు ట్రైలర్ ని చూసి మీ ఊహల్లో ఈ చిత్రాన్ని ఎలా అయినా ఊహించుకొని ఉండొచ్చని, కానీ ఒక్కసారి మీరు థియేటర్ లోకి ఎంటర్ అయ్యాక ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే ని చూసి సర్ప్రైజ్ కి గురి అవుతారని, అలాంటి అంశాలు ఈ చిత్రం లో బోలెడన్ని ఉన్నాయని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాసేపటి క్రితమే తెలుగు ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.

Also Read: కూలీ లో నా క్యారక్టర్ రజనీకాంత్ ని డామినేట్ చేస్తుంది – అక్కినేని నాగార్జున

ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రేక్షకులు ఊహించని సర్ప్రైజ్ అంటే ఏమి అయ్యుంటుంది?, ట్రైలర్ ని చూస్తుంటే స్టోరీ దాదాపుగా అర్థమైపోయింది, తన స్నేహితుడి కూతుర్ని కాపాడుకోవడం కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ చేసే పోరాటమే ఈ సినిమా, అదే విధంగా అసాంఘిక కార్యక్రమాలకు కూలీలను వాడుకుంటూ , వాళ్ళని మనుషులు లాగా కూడా చూడని యాజమాన్యం వద్ద కూలీ పవర్ ని చూపించే హీరోగా కూడా రజనీకాంత్ ఇందులో కనిపిస్తాడని ట్రైలర్ ని చూసి చెప్పొచ్చు, కానీ ఇవి కాకుండా సినిమా లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి?, అది తెలుసుకోవడానికి ఆగష్టు 14 వరకు ఆగాలంటే కష్టం అన్నట్టుగా సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి డైరెక్టర్ చెప్పిన ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే మరో పది రోజులు

[

Leave a Comment