ఏ టీ20 వరల్డ్ కప్ ఇవ్వగలదు.. ఏ ఛాంపియన్స్ ట్రోఫీ అందించగలదు..ఏం విక్టరీ భయ్యా.

Eng Vs Ind 5th Test

Eng Vs Ind 5th Test: టి20కి అలవాటు పడ్డాం. వన్డే ఫార్మాట్ ను మాత్రమే చూస్తున్నాం. టెస్ట్ అంటే బోరింగ్ అనే నిర్ణయానికి వచ్చాం. కానీ మనం చూసేది తప్పు.. అనుకున్నది తప్పు.. చేస్తున్నది తప్పు అని నిరూపించారు టీమిండియా ప్లేయర్లు. వాస్తవానికి మనలో చాలామందికి టెస్ట్ క్రికెట్ అంటే బోరింగ్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ సుదీర్ఘంగా సాగుతుంది. పైగా పరుగులు వేగంగా రావు. ఆటగాళ్లు నిదానంగా ఆడతారు. బౌలర్లు సుదీర్ఘంగా బౌలింగ్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో మన ఊహించిన క్రికెట్.. కలలు గన్న ఆటను చూడలేం. అయితే అలాంటి అభిమానులకు వీనుల విందైన క్రికెట్ ఆనందాన్ని.. క్రికెట్ మజాను అందించారు టీం ఇండియా ప్లేయర్లు.

Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..

లండన్ ఓవల్ మైదానంలో ఐదవ టెస్ట్ ను ఆరు పరుగుల తేడాతో గెలిచి.. ఆతిధ్య జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు టీమిండియా ప్లేయర్లు. వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టు ఎదుట టీమ్ ఇండియా ఏకంగా 374 రన్స్ టార్గెట్ విధించింది. ఈ పరుగులను చేయడంలో ఇంగ్లాండ్ వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రూట్, బ్రూక్ నాలుగో వికెట్ కు ఏకంగా 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అన్నిటికంటే ముఖ్యంగా బ్రూక్ క్యాచ్ ను సిరాజ్ మిస్ చేశాడు. అది టీమ్ ఇండియాకు చాలా ఎక్స్పెన్సివ్ గా మారింది.. ఈ దశలో బ్రూక్ .. రూట్ ద్వయం శతకాలు సాధించడంతో ఇంగ్లాండ్ జట్టుకు ఎదురులేకుండా పోయింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోని అవుట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ ఇండియా చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత బెతెల్ కూడా అవుట్ కావడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఈలోగా వర్షం కురవడంతో నాలుగో రోజు ఆటను అంపైర్లు నిలిపివేశారు.

ఐదో రోజు ఆట ప్రారంభంలో ప్రసిద్ బౌలింగ్లో ఓవర్టన్ రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో టీమిండియా విజయంపై అందరి ఆశలు సన్నగిల్లాయి. ఈ దశలో బంతి అందుకున్న సిరాజ్ ప్రమాదకరమైన జేమి స్మిత్ ను అవుట్ చేశాడు.. సిరాజ్ వేసిన ఇన్సైడ్ స్వింగర్ ను తప్పుడు అంచనా వేసిన స్మిత్.. భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఆ బంతి స్మిత్ బ్యాట్ చివరి అంచు తగులుతూ కీపర్ జూరెల్ చేతులో పడింది.. దీంతో టీం ఇండియాలో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. ఇదే ఊపులో ఓవర్టన్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు సిరాజ్.. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ టీమ్ ఇండియా వైపు మొగ్గింది. ఈ దశలో ప్రసిద్ద్ కృష్ణ టంగ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఈ దశలో వోక్స్ ఒంటి చేత్తో బ్యాటింగ్ కి వచ్చాడు. మరోవైపు అట్ కిన్సన్ సిరాజ్ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో మ్యాచ్ ఏమైనా ఇంగ్లాండ్ వైపు వెళ్తుందా అనే అనుమానాలు సగటు భారత అభిమానిలో కలిగాయి. అప్పటికి విజయ సమీకరణం ఆరు పరుగులుగా ఉన్న నేపథ్యంలో.. బంతి అందుకున్న సిరాజ్ యార్కర్ వేశాడు. ఆ బంతిని ఊహించని అట్కిన్సన్ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ బంతి వికెట్లను పడగొట్టడంతో ఒకసారిగా టీమిండియా శిబిరంలో ఆనందాలు వెల్లి విరిసాయి. మైదానంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.

[

Leave a Comment