Girls Suffer: ఎక్కువ శాతం అమ్మాయిలు బాధపడుతూ కనిపిస్తూ ఉంటారు. కొంతమంది చిన్న విషయానికే పెద్ద హైరానా పడిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఒక్కసారి డిప్రెషన్ లోకి వెళితే రోజుల తరబడి ఏడుస్తూ ఉంటారు. ఇలా పురుషుల కంటే అమ్మాయిలు ఎక్కువ గా ఎందుకు బాధ పడాల్సి వస్తుంది? వారి శరీరంలో జరిగే మార్పులు ఏంటి? ఏ కారణం చేత మనసు ఆందోళనగా మారుతుంది?
Also Read: ఏపీ అభివృద్ధికి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్!
పురుషులకంటే అమ్మాయిల్లో హార్మోన్స్ ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. ఇవి తగ్గినప్పుడల్లా అమ్మాయిల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిల్లో ఈస్ట్రోజన్, ప్రొజె స్టెరాన్ వంటి హార్మోన్ లో ఉంటాయి. వీటిలో ఈస్ట్రోజన్ ఎముకల ఆరోగ్యం, గుండె ఆరోగ్యం ఉండేందుకు పనిచేస్తుంది. అలాగే మెదడు పనితీరును సక్రమంగా ఉండేలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఋతుచక్రం లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అయితే కొన్ని పరిస్థితుల వల్ల హార్మోన్లు అసమతుల్యం ఏర్పడుతుంది. ఋతుస్రావం వంటి సమయాల్లో వీరి మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్న వారిలో కూడా హార్మోన్లు సక్రమంగా ఉండే అవకాశం ఉండదు. అండాశయ సమస్యలు ఉన్నవారిలోనూ ఈ పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రతిరోజు కొన్ని మందుల వాడడం వల్ల కూడా హార్మోన్ల అసమ్మతుల్యత ఏర్పడుతుంది.
అయితే ఈ సమయంలో వీరు ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. చిన్నచిన్న సమస్యలకే ఆందోళన పడుతూ ఉంటారు. ఒక్కోసారి వీరికి శరీరం బరువు పెరిగినట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా నిద్ర లేమి ఏర్పడి తీవ్ర ఆందోళన కలుగుతుంది. ఏ పని చేయడానికి శక్తి రాదు. అలసటతో ఉండిపోతారు. లైంగిక చర్య పై ఆసక్తి తగ్గుతుంది.
ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే తేరుకోవాలి. మానసికంగా ఉన్న ఆందోళనలను తొలగిపోవడానికి వెంటనే వ్యాయామం చేయాలి. ముందుగా ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగ, జ్ఞానం వంటివి చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కొన్ని రోజులపాటు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్లు సక్రమంగా ఉండిపోతాయి. ఇక ప్రతిరోజు ఏడు నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. నిద్ర తక్కువ కావడం వల్ల శరీరంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
అన్ని రకాలుగా ఆరోగ్య పనులు చేసినా కూడా మానసిక ఆందోళన ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఒక్కోసారి తెలియకుండానే మనసులో ఏదో అలజడి ప్రారంభమవుతుంది. దీని నివారణకు చిట్కాలు కాకుండా వైద్య చికిత్స అవసరమవుతుంది. అందువల్ల అమ్మాయిలు పదేపదే కోపానికి తెచ్చుకోవడం.. విపరీతంగా బాధపడడం.. రోజులపాటు ఏడుస్తూ ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించి మానసిక చికిత్స తీసుకోవాలని తెలుపుతున్నారు.
[