Anderson Tendulkar Test Series: టి20 దుమ్ము రేపుతోంది. వన్డే అదరగొడుతోంది. ఇలాంటి కాలంలో టెస్ట్ క్రికెట్ ఎవరు చూస్తారు? అసలు అన్ని రోజులపాటు సాగే ఆటను కళ్ళు అప్పగించుకొని మరి చూసే వారెవరు? ఈ ప్రశ్నకు అండర్సన్ – టెండూల్కర్ సిరీస్ ప్రారంభానికి ముందు సమాధానం లేదు. కానీ ఇకపై ఆ ప్రశ్న వేసే అవకాశం లేదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో సొగసును.. టెస్ట్ క్రికెట్లో అందాన్ని.. టెస్ట్ క్రికెట్లో కనిపించే అసలు సిసలైన ఆటను అండర్సన్ – టెండూల్కర్ సిరీస్ రుచి చూపించింది. ఈ సిరీస్ లో మ్యాచ్ జరిగాయి. ఒక మ్యాచ్ డ్రా అయింది. అయితే డ్రా అయిన విధానం కూడా అద్భుతంగా ఉంది. దానిని డ్రా అనడం కంటే పోరాట స్ఫూర్తి అని చెప్పడం సబబు. ఆ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించి టీమిండియా అదరగొట్టింది. అదే ఊపులో చివరి టెస్టులో ఆరు పరుగుల తేడాతో గెలిచి.. అద్భుతం సాధించింది.
Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..
సాధారణంగా టెస్ట్ క్రికెట్ ఐదు రోజుల పాటు సాగుతుంది. కాకపోతే అన్ని మ్యాచ్లు ఐదు రోజుల పాటు సాగవు. కొన్ని మూడు రోజులలోనే ముగుస్తాయి. మరికొన్ని నాలుగు రోజుల్లో సమాప్తం అవుతాయి. అలాంటప్పుడు చూసే వాళ్లకు అంతగా క్రికెట్ ఆనందం లభించదు. అయితే అండర్సన్ టెండూల్కర్ సిరీస్ మాత్రం అద్భుతమైన క్రికెట్ ఆనందాన్ని అభిమానులకు అందించింది. దాదాపు 25 రోజులపాటు సాగిన ఐదు టెస్టుల సిరీస్ అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఇప్పట్లో ఈ సిరీస్ ను ఏ ఆటగాడు మాత్రమే కాదు అభిమాని కూడా మర్చిపోడు. ఎందుకంటే ఆ స్థాయిలో కిక్ ఇచ్చింది.. ప్రతి మ్యాచ్ కూడా ఐదు రోజులపాటు సాగి టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించింది.
2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే కేవలం నాలుగు సిరీస్ లలో మాత్రమే మ్యాచులు ఐదు రోజుల పాటు సాగాయి. అందులో 2001లో వెస్టిండీస్ వేదికగా వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ప్రతి మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగింది.
2004-05 కాలంలో దక్షిణాఫ్రికా వేదికగా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ తలపడిన సిరీస్లో.. ప్రతి మ్యాచ్ కూడా ఐదు రోజులపాటు సాగింది.
2017 -18 కాలంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వేదికగా తలపడ్డాయి. ప్రతి మ్యాచ్ కూడా ఐదు రోజుల పాటు సాగింది.
ప్రస్తుత ఏడాదిలో అండర్సన్ టెండుల్కర్ సిరీస్ లో భాగంగా.. ఇంగ్లాండ్, ఇండియా ఇంగ్లాండ్ వేదికగా ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడాయి. ఇందులో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. రెండవ మ్యాచ్ ఇండియా గెలిచింది. మూడో మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. నాలుగో మ్యాచ్ డ్రా అయింది. ఐదో మ్యాచ్ ఇండియా గెలిచింది. అయితే ప్రతి మ్యాచ్ కూడా ఐదు రోజుల పాటు సాగింది. ఐదవ టెస్ట్ మాత్రమే ఐదో రోజు తొలి సెషన్ లో ముగిసింది. మిగతా అన్ని కూడా చివరి వరకు సాగాయి. ఒకరకంగా రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడిన నేపథ్యంలో.. అభిమానులకు అద్భుతమైన క్రికెట్ ఆనందం లభించింది.
[