Site icon Desha Disha

Rakshi Festival: మీ రాశి ప్రకారం రాఖీ రోజున ధరించే దుస్తుల రంగును ఎంచుకోండి.. సంబంధం మధురంగా మార్చుకోండి.. – Telugu News | Rakshi Festival 2025: Wear Clothes According To Zodiac Sign On Rakhi For Good Luck

Rakshi Festival: మీ రాశి ప్రకారం రాఖీ రోజున ధరించే దుస్తుల రంగును ఎంచుకోండి.. సంబంధం మధురంగా మార్చుకోండి.. – Telugu News | Rakshi Festival 2025: Wear Clothes According To Zodiac Sign On Rakhi For Good Luck

రాఖీ పండుగను సోదర-సోదరి ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకి రక్షగా ఒక దారాన్ని కడతారు. అప్పుడు సోదరులు తమ సోదరీమణులను ఎల్లవేళలా రక్షిస్తామని హనిమిస్తారు. ఈ రాఖీ పండగ రోజున అన్న దమ్ములు, అక్క చెల్లెలు తమ రాశి ప్రకారం దుస్తుల రంగును ఎంచుకుంటే.. అప్పుడు వారి మధ్య సంబంధం మరింత మధురంగా, బలంగా మారుతుంది. ఎవరికైనా తమ జన్మ రాశి తెలియకపోతే అప్పుడు రాఖీ కట్టే సమయంలో సోదరీమణులు ఎరుపు రంగు దుస్తులు ధరించవచ్చు. ఈ రోజు ఏ రాశికి చెందిన అక్క చెల్లెలు ఏ రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుందో తెలుసుకుందాం..

  1. మేష రాశి: ఈ రాశి వారికి ఎరుపు రంగు శుభప్రదం. రాఖీ పండగ రోజున ఎర్రటి దుస్తులు ధరించి సోదరుడికి ఎరుపు రంగు రాఖీ కట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇద్దరి మధ్య పరస్పర సంబంధాలను బలపరుస్తుంది.
  2. వృషభ రాశి: ఈ రాశి వారికి తెలుపు లేదా ఆకాశ నీలం రంగు అదృష్టకరం. రాఖీ పండగ కట్టే సమయంలో వీరు ఆకాశ నీలం లేదా అలాంటి ఏదైనా రంగు దుస్తులను ధరించవచ్చు. సోదరుడి రాశి వృషభం అయితే, సోదరి ఆకాశ నీలం రంగు రాఖీని కట్టడం శుభప్రదం.
  3. మిథున రాశి: వీరు ఆకుపచ్చ , సముద్ర-ఆకుపచ్చ రంగును ధరించడం శుభప్రదం. ఈ రంగు రాఖీని మీ సోదరుడికి కూడా కట్టండి. ఈ రంగు సోదర,సోదరిమణుల మధ్య పరస్పర సంబంధాలలో సామరస్యాన్ని పెంచుతుంది.
  4. కర్కాటక రాశి: ఈ రాశి వారు పాలలాంటి తెల్లని దుస్తులు ధరించడం మేలు చేస్తుంది. వీరు తమ సోదరుడి రాశి కర్కాటక రాశి అయితే.. వారికి పాలలాంటి తెల్లని రాఖీ కట్టడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.
  5. ఇవి కూడా చదవండి

  6. సింహ రాశి: ఈ రాశి వారికి నారింజ రంగు శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాఖీ పండుగ రోజున అన్న చెల్లెలు ఇద్దరూ నారింజ రంగు దుస్తులు ధరించాలి.
  7. కన్య రాశి: వీరు పిస్తా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. వీరు ఈ రంగు రాఖీని తమ సోదరుడికి కట్టవచ్చు. ఇది అదృష్టాన్ని పెంచుతుంది.
  8. తుల రాశి: వీరు ఈ రోజున ప్రకాశవంతమైన నీలం రంగు దుస్తులు ధరించాలి. సోదరుడికి నీలం రంగు రాఖీ కట్టడం వల్ల సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది.
  9. వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సోదరుడికి ఎరుపు రాఖీ కట్టడం వల్ల సోదర,సోదరిమణుల సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది.
  10. ధనుస్సు రాశి: వీరు రాఖీ కట్టే ముందు కుంకుమ రంగు దుస్తులు ధరించాలి. వీరి సోదరుడి రాశి ధనుస్సు అయితే కుంకుమ రంగు రాఖీని కట్టడం శుభ ఫలితాలనిస్తుంది.
  11. మకర రాశి: ఈ రాశి వారు నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. వీరు తమ సోదరుడికి నీలం రంగు రాఖీ కట్టడం వలన సోదర,సోదరిమణుల మధ్య సానుకూలతను చెక్కుచెదరకుండా ఉంచుతుంది.
  12. కుంభ రాశి: ఈ రాశి వారికి నీలం రంగు కూడా అనుకూలంగా ఉంటుంది. వీరు తమ సోదరుడికి నీలిరంగు రాఖీ కట్టడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి
  13. మీన రాశి: ఈ రాశికి చెందిన సోదరీమణులు పసుపు రంగు దుస్తులు. వీరు తమ సోదరుడికి పసుపు రంగు రాఖీ కట్టడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమ, సామరస్యాన్ని పెంచుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Exit mobile version