Operation Mahadev: పచ్చగా ఉన్న జమ్ము కాశ్మీర్లో కొద్ది నెలల క్రితం పహాల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు చేపట్టి మన దేశ పౌరులను చంపేశారు. శ్వేతసౌదంలాగా వెలిగిపోతున్న కాశ్మీర్ రాష్ట్రంలో నెత్తుటి ఏర్లను పారించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులు మొత్తం పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కర మూకలని భారత ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద తాండాలను నేలమట్టం చేసింది. అయినప్పటికీ పహల్గాం దాడుల్లో పాల్గొన్నవారు సేఫ్ గా ఉండడం భారత భద్రతా దళాలకు ఏమాత్రం సంతృప్తి ఇవ్వలేదు.
అప్పటినుంచి అదును కోసం ఎదురుచూస్తున్న భారత భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. పహల్గాం దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. ఈ ఆపరేషన్ కు భారత భద్రత దళాలు మహదేవ్ అని పేరు పెట్టాయి. భద్రతా దళాలు చేసిన దాడిలో పహాల్గాం ఘటనకు సూత్రధారి, లష్కరే తోయిబా కమాండర్ హసీం ముసా, మరో ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఘటనలో కన్నుమూశారు.. ఆపరేషన్ మహాదేవ్ లో చీనార్ కార్ప్స్, 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా స్పెషల్ ఫోర్సెస్ పాల్గొన్నాయి. గడచిన రెండు వారాలుగా ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. దాచిగాం నేషనల్ పార్క్ పరిసర ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు మన భద్రత దళాలకు తెలిసింది. అక్కడ ఉన్న సంచార జాతుల వారు కూడా ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు అడవిలో దట్టమైన చెట్ల కింద తవ్విన ఒక గుహలో తలదాచుకున్నట్టు సమాచారం. పక్కా సమాచారంతో భద్రతా దళాలు వారిని చుట్టుముట్టి.. ఒక్కసారిగా మట్టు పెట్టాయి.. ఈ దాడిలో లష్కరేతోయిబా, జై షే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్లకు చెందిన ఏడు మంది ముష్కరులను భద్రతా దళాలు అంతం చేశాయి. అయితే ఆపరేషన్ మహదేవ్ ఆగిపోలేదని.. ఇంకా కొనసాగుతూనే ఉంటుందని భద్రతా దళాలు చెబుతున్నాయి.
Also Read: గ్యాస్ సిలిండర్ పై ఇన్సూరెన్స్… ఎన్ని లక్షలో తెలుసా?
ఆ పేరు ఎందుకు పెట్టారంటే
దాచి గాం సమీపంలో మహదేవ్ అనే పర్వతం ఉంటుంది. అందువల్లే ఈ ఆపరేషన్ కు మహదేవ్ అని పేరు పెట్టారు. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం జబర్వన్, మహదేవ్ పర్వతాల మధ్య ఉంది. అందువల్లే ఈ ఆపరేషన్ కు ఆ పేరు పెట్టారు. ఇక్కడ మహదేవ్ పర్వతంలో శివుడు నడయాడాడని.. అందువల్లే ఈ పర్వతం మహిమాన్వితమైనదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి దట్టమైన అడవిలో శివుడు తపస్సు చేశాడని.. దానికి సంబంధించిన ఆడవాళ్లు కూడా ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటారు.