సోమవారం కుజుడు కన్యారాశిలోకి అడుగు పెట్టాడు. ఈ సంచారం ఆధ్యాత్మిక, జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను మరింత పెంచింది. జూలై 28, 2025న కన్యారాశిలో కుజుడు అడుగు పెట్టడం వలన అనేక రాశులకు సవాలుతో కూడిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వృషభ, సింహ, కన్య, ధనుస్సు , మీన రాశి వారు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈ కుజ సంచారం శని కోణంలో ఉండనుంది. దీంతో శని, కుజల కలయిక సంసప్తక యోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం కొన్ని రాశులకు ఉద్రిక్తత, వివాదం, గాయం లేదా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ కుజ సంచారము వల్ల ప్రతికూలంగా ప్రభావితమయ్యే రాశులకు చెందిన వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
కుజ సంచారము, సంసప్తక యోగం
కన్యారాశిలో కుజుడు ప్రవేశించడంతో శనీశ్వరుడితో సంసప్తక యోగం (7వ కోణం) ఏర్పడుతోంది. కుజుడు, శనీశ్వరుడి ముఖాముఖి కోణం సంఘర్షణ, మానసిక అసమతుల్యత, పని రంగంలో అడ్డంకులకు దారితీస్తుంది. ఈ యోగం గ్రహాల సంఘర్షణను సూచిస్తుంది, ఇది జీవితంలో అడ్డంకులు, కోపం, అలసటను పెంచుతుంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారు కుజుడు సంచార సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఏ రాశిచక్ర గుర్తులపై ప్రతికూల ప్రభావం ఉండనున్నదంటే
వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు కుటుంబ కలహాలు, ఆర్థిక నష్టం కలిగిస్తాయి. నిద్ర లేకపోవడం, అలసట సమస్యతో ఇబ్బంది పడతారు. అంతేకాదు ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఆఫీసులో అనవసర వివాదాలు ఏర్కోవాల్సి ఉంటుంది. కడుపు సమస్యలు, పిల్లలకు సంబంధించిన విషయాలలో ఆందోళన పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, బెల్లం, పప్పు దానం చేయండి.
సింహ రాశి: వీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. కెరీర్ లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. వీరు భాగస్వామ్యంలో వివాదం ఎదుర్కొనాల్సి వస్తుంది. సింహ రాశి వారు రక్తపోటు లేదా తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
పరిహారం: మంగళవారం ఎరుపు రంగు దుస్తులు ధరించండి. ఓం భౌమాయ నమః అనే మంగళ మంత్రాన్ని జపించండి.
కన్య రాశి: కుజ సంచారంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడాల్సి ఉంది. కడుపు సమస్యలు, కోపం, చిరాకు, మానసిక అలసట వంటి ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అంతేకాదు వీరు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవడంలో గందరగోళానికి గురవుతారు. సంబంధంలో చీలిక వచ్చే అవకాశం ఉంది.
పరిహారం: శివ అభిషేకం చేయాలి. ప్రతిరోజూ తులసి దళాలు తినండి.
ధనుస్సు రాశి: వీరు పనిలో ఒత్తిడిని ఎదుర్కొనాల్సి ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అధికంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు కెరీర్ గురించి ఆందోళన పడాల్సి ఉంటుంది.
ఉన్నతాధికారులతో సంబంధాలు క్షీణించవచ్చు. కాళ్ళు లేదా తొడలలో నొప్పి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
పరిహారం: మంగళవారం రోజున రాగి పాత్రలో సూర్యుడి అర్ఘ్యం సమర్పించండి. ఎర్ర చందనంతో బొట్టు పెట్టుకోండి.
మీన రాశి: వీరు నిద్రలేమి లేదా జీర్ణ సమస్యలు, మానసిక అలసట, వెన్నునొప్పి, చర్మ సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. సంబంధాలలో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాల్లో గందరగోళం నెలకొంటుంది. కుటుంబ ఖర్చులు పెరగవచ్చు.
పరిహారం: ఓం అంగారకాయ నమః అని పఠించండి. పప్పులు దానం చేయండి.
కుజ సంచారంతో చేయాల్సిన పరిహారాలు
- ఈ అంగారక సంచారము అనేక రాశులకు చెందిన వ్యక్తులకు ఆందోళన, సవాళ్లను తెస్తుంది. అయితే సకాలంలో పరిహారాలు చేస్తే ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు.
- మంగళవారం రోజున ఎర్రటి దుస్తులు, పప్పు, రాగి పాత్రలు దానం చేయండి.
- ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి, “ఓం భౌమాయ నమః” అనే మంత్రాన్ని జపించండి.
- వేడిగా, కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి, పుష్కలంగా నీరు త్రాగండి.
- ఇనుము లేదా పదునైన వస్తువులతో జాగ్రత్తగా ఉండండి.
- వాహనాల డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి.
- కోపాన్ని, మాటను నియంత్రించుకోండి. మంగళవారం ఉపవాసం ఉండండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.