KCR farmhouse meeting : కవిత vs జగదీశ్వర్ రెడ్డి.. ఫామ్ హౌస్ లో కెసిఆర్ కీలక సమావేశం.. గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది?

KCR farmhouse meeting : క్రమశిక్షణకు మారుపేరుగా.. ఏక వ్యక్తి స్వామ్యానికి నిలువుటద్దంగా మొన్నటి వరకు భారత రాష్ట్ర సమితి ఉండేది. పార్టీలో ఎన్ని లుకలుకలు ఉన్నప్పటికీ అవి బయటకు వచ్చేవి కాదు. పైగా కేసీఆర్ లేదా కేటీఆర్ చెప్పింది మాత్రమే భారత రాష్ట్ర సమితిలో వేదంగా ఉండేది. అలాంటి భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు కవిత రూపంలో ముసలం పుట్టింది. కొంతకాలంగా ఆమె పార్టీ లోని నాయకుల వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ.. వివిధ మాధ్యమాలలో ఆమె తమ ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పరిస్థితిని వివరిస్తూ తన తండ్రికి రాసిన లేఖలను.. పార్టీలో ఉన్న కీలక నాయకులు లీక్ చేయడంతో ఒక్కసారి గా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నాటి నుంచి ఆమె పార్టీలో ఉన్న పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కవిత చేస్తున్న వ్యాఖ్యలు గ్రౌండ్ లెవెల్ లో భారత రాష్ట్ర సమితి డ్యామేజ్ చేస్తున్నాయి. ఇదే విషయం పింక్ పార్టీ పెద్దలకు తెలియడంతో.. వారు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో.. మెజారిటీ స్థానాలు గెలుచుకొని సత్తా చాటాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్టు.. ఆ పార్టీ శాసనమండలి సభ్యురాలు మరొకటి తలిచారు. తద్వారా పార్టీలో పరిస్థితి అంతకంతకూ మారిపోతున్నది.

జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేయడం.. గంటల వ్యవధిలోనే జగదీశ్వర్ రెడ్డి కౌంటర్ ఎటాక్ ఇవ్వడంతో భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న అంతర్గత పోరు ఒక్కసారిగా రచ్చకెక్కింది. కల్వకుంట్ల కవితను ఉద్దేశించి జగదీశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో కవితను ఉద్దేశించి ఈ స్థాయిలో ఏ నాయకుడు కూడా మాట్లాడలేదంటే జగదీశ్వర్ రెడ్డి చేసిన విమర్శలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జగదీశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు కవిత క్యాంప్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. బహుశా దీనిపై కవిత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాల్సి ఉంది.

కవిత, జగదీశ్వర్ రెడ్డి వ్యవహారం నేపథ్యంలో గులాబీ బాస్ కెసిఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, జగదీశ్వర్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.. పైకి గులాబీ ఆస్థాన మీడియా కాలేశ్వరం కమిషన్ మీద కేసీఆర్ భేటీ అయ్యారని చెబుతున్నప్పటికీ.. అసలు విషయం కల్వకుంట్ల కవితనేని తెలుస్తోంది. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బయటికి పంపించే కెసిఆర్.. కల్వకుంట్ల కవిత విషయంలో మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె వ్యవహారం పార్టీకి మరింత నష్టం చేకూర్చకముందే చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కవితను పిలిచి మాట్లాడతారా? లేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. వైపు తన లేఖలు లీక్ చేసిన వ్యక్తులపై అధిష్టానం చర్యలు తీసుకునేంతవరకు తాను పార్టీకి దూరంగా ఉంటానని ఇప్పటికే కవిత స్పష్టం చేశారు.

[

Leave a Comment